కొత్త ఏడాది వేళ వెండితెరపై మరో ప్రేమకథ పట్టాలెక్కింది. బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కీర్తి కుల్హారి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ (Four More Shots Please!) సహనటుడు రాజీవ్ సిద్ధార్థతో ప్రేమలో ఉన్నట్లు కీర్తి తాజాగా అధికారికంగా ప్రకటించారు.
ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా ప్రేమాయణం

శుక్రవారం (జనవరి 2) నాడు కీర్తి కుల్హారి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రత్యేకమైన రీల్‌ను షేర్ చేశారు. అందులో రాజీవ్‌తో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కారులో తీసుకున్న సెల్ఫీలు, కలిసి చేసిన ప్రయాణాలు, లిఫ్టులో దిగిన క్యూట్ ఫోటోలతో పాటు.. రాజీవ్ నుదుటిపై ఆమె ముద్దు పెడుతున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో చివరలో కిటికీపై బాణం గుర్తుతో ఉన్న హార్ట్ బొమ్మను చూపిస్తూ తన ప్రేమను చాటుకున్నారు కీర్తి కుల్హారి. "ఒక చిత్రం వెయ్యి మాటల కంటే గొప్పది.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు" అంటూ కీర్తి కుల్హారి రాసుకొచ్చారు. దీంతో రాజీవ్ సిద్ధార్థతో రిలేషన్‌లో ఉన్నట్లు అఫిషియల్‌గా ప్రకటించింది కీర్తి.
అంజనా-మిహిర్ జోడీకి ఫ్యాన్స్ ఫిదా
ఈ పోస్ట్ చూసిన వెంటనే వారి సహనటులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‌లో అంజనా, మిహిర్ పాత్రలు ఎంతో పాపులర్ అయ్యాయి. దీంతో నెటిజన్లు "ప్యారలల్ యూనివర్స్‌లో అంజనా, మిహిర్ ఒక్కటయ్యారు", "కొత్త జంట చూడముచ్చటగా ఉంది" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
గతం చేదు జ్ఞాపకం.. భవిష్యత్తుపై ఆశ
వీరి సిరీస్ కో-స్టార్ మాన్వి గాగ్రూ కూడా "హ్యాపీ న్యూ ఇయర్ లవ్లీస్" అంటూ ఈ జంటకు తన ఆశీస్సులు అందించారు. కాగా, కీర్తి కుల్హారీ గతంలో సాహిల్ సెహగల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021 ఏప్రిల్‌లో తాము విడిపోతున్నట్లు ఆమె ప్రకటించారు.
{{/usCountry}}వీరి సిరీస్ కో-స్టార్ మాన్వి గాగ్రూ కూడా "హ్యాపీ న్యూ ఇయర్ లవ్లీస్" అంటూ ఈ జంటకు తన ఆశీస్సులు అందించారు. కాగా, కీర్తి కుల్హారీ గతంలో సాహిల్ సెహగల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021 ఏప్రిల్‌లో తాము విడిపోతున్నట్లు ఆమె ప్రకటించారు.
{{/usCountry}}"ఎవరితోనైనా కలిసి ఉండటం కంటే, విడిపోవాలని నిర్ణయించుకోవడం చాలా కష్టం. అది మనల్ని ప్రేమించే వారికి బాధ కలిగిస్తుంది. కానీ, జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి" అంటూ అప్పట్లో కీర్తి కుల్హారి భావోద్వేగంగా స్పందించారు.
హాట్ టాపిక్‌గా
ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి, ఇప్పుడు రాజీవ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చినా, ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో ఈ సరికొత్త ప్రేమకథ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇదిలా ఉంటే, కీర్తి, రాజీవ్ కలిసి నటించిన ఓటీటీ బోల్డ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. అమెజాన్ ప్రైమ్‌లో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు సీజన్స్ ఉన్న ఈ ఓటీటీ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.