OTT Telugu: నాలుగో ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ స్టోరీ

OTT Telugu: మరో ఓటీటీలోకి ఎమోషనల్ తెలుగు థ్రిల్లర్ మూవీ యుఫోరియా స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈసారి కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం నాలుగు భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ఆహా, ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్స్ లో ఫ్రీగా.. ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.

Published on: Jul 23, 2026, 14:11:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన తెలుగు యూత్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ 'యూఫోరియా' (Euphoria 2026) ఓటీటీలో రచ్చ కొనసాగిస్తోంది. ఐదున్నర కింద థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు నాలుగో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో నాలుగు భాషల్లో చూడొచ్చు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు కూడా అందుబాటులోకి రావడంతో మూవీ రీచ్ మరింత పెరగనుంది.

OTT Telugu: నాలుగో ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ స్టోరీ
OTT Telugu: నాలుగో ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్.. రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ స్టోరీ

ఐఎండీబీలో 7.5 రేటింగ్.. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్!

ప్రముఖ సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఏకంగా 7.5 రేటింగ్ సాధించిన ఈ ఇంటెన్స్ యూత్ డ్రామా డిజిటల్ స్పేస్‌లో మైండ్ బ్లాకింగ్ వ్యూయర్‌షిప్ సాధిస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, డ్రగ్స్ కల్చర్, ఓ రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన యుఫోరియా మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఆహా వీడియో, ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మొదట ఏప్రిల్ 2న ఈటీవీ విన్ లోకి, తర్వాత ఏప్రిల్ 22న ఆహాలోకి ఈ సినిమా వచ్చింది.

'యుఫోరియా' కథ ఏంటంటే..

గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన యుఫోరియా సినిమా స్టోరీ హైదరాబాద్‌లో 2022లో జరిగిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. చైత్ర అనే 17 ఏళ్ల అమ్మాయి క్యారెక్టర్‌లో సారా అర్జున్ అద్భుతంగా నటించింది. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో ఉండే ఆ అమ్మాయి ఒక పార్టీకి వెళ్లినప్పుడు, పెద్ద కుటుంబాలకు చెందిన ఐదుగురు మైనర్ కుర్రాళ్ల చేతిలో దారుణంగా అఘాయిత్యానికి గురవుతుంది.

ఆ తర్వాత ఆ అమ్మాయి, ఆమె ఫ్యామిలీ పడే నరకం ఒక వైపు అయితే.. తప్పు చేసిన ఆ మైనర్ల కుటుంబాలు ఫేస్ చేసే పరిణామాలు మరోవైపు చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తారు. ఇందులో ఒక నేరస్థుడి తల్లి పాత్రలో భూమిక నటించింది. డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబాలు ఎలా బిహేవ్ చేస్తాయి.. ఒక నిజాయితీ గల తల్లి తన కొడుకు క్రిమినల్ అని తెలిశాక ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది అనేది ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా కళ్ళకు కట్టినట్లు చూపించారు.

యుఫోరియా పబ్లిక్ టాక్

ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఐఎండీబీలో మాత్రం 7.5 రేటింగ్ నమోదైంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా, గ్రిప్పింగా సాగినా.. సెకండాఫ్ లోనే కాస్త కథ పక్కదారి పట్టినట్లు కూడా కొందరు తమ రివ్యూల్లో చెప్పారు. అయితే ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రైమ్ వీడియోలో రచ్చ

ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఇప్పటికీ ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులో ఉండటం విశేషం. అయినా కూడా ఒక దశలో ఈ సినిమా హాలీవుడ్ టాప్ మూవీ మైఖేల్ ను కూడా వెనక్కి నెట్టింది. ఈ చిన్న తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్‌లో భారీ క్రేజ్ ఉన్న హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ 'మైఖేల్' (Michael), 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary) లాంటి చిత్రాలను సైతం వెనక్కి నెట్టడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More