OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 7 మరింత ఇంట్రెస్టింగ్- అమెజాన్ ప్రైమ్‌లో 4!
OTT Release Movies In Telugu Latest: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 మూవీస్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. విభిన్న జోనర్లలో, డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాల్లో 7 తెలుగు స్ట్రయిట్ మూవీస్‌గా మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఆ మూవీస్, వాటి ఓటీటీలు ఏంటో లుక్కేద్దాం.
OTT Telugu Movies Release Last Week: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా, జీ5, లయన్స్ గేట్ ప్లే వంటి తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లేచింది మహిళా లోకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 22 (సన్ నెక్ట్స్ ఓటీటీలో కూడా)
మ్యాన్షన్ హౌజ్ మల్లేష్ (తెలుగు రూరల్ సెటైరికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 22
ఆల్ఫా: మెన్ లవ్ వెంజన్స్ (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 22
హ్యాపీ రాజ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ )- ఏప్రిల్ 23
ప్రతిఛాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23
అపెక్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 24
నీ ఫరెవర్ (తెలుగు డబ్బింగ్ తమిళ మోడర్న్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 24
ఆహా ఓటీటీ
యుఫోరియా (తెలుగు సోషల్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 22 (ఈటీవీ విన్ ఓటీటీలో కూడా)
లగ్గం టైమ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
ఈటీవీ విన్ ఓటీటీ
సోలో ట్రిప్ (తెలుగు సెలబ్రిటీ ట్రావెల్ టాక్ షో)- ఏప్రిల్ 23
ఆమె కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 26
బ్యాండ్ మేళం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- ఏప్రిల్ 24
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ డిజాస్టర్ సర్వైవల్ యాక్షిన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 24
ఓటీటీలోకి తెలుగులో 15
ఇలా గత వారం (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు) తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్లలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 7
అయితే, వీటిలో మంచు లక్ష్మీ లేచింది మహిళా లోకం, మ్యాన్షన్ హౌజ్ మల్లేష్, జగపతి బాబు సోలో ట్రిప్, ఆమని ఆమె కథ, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి బ్యాండ్ మేళం, లగ్గం టైమ్, భూమిక-సారా అర్జున్ యుఫోరియా వంటి 7 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే ఏకంగా 4 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


