ఓటీటీని షేక్ చేస్తోంది తెలుగు యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ‘జిగ్రీస్’. నలుగురు ఫ్రెండ్స్ ట్రిప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఈ మూవీకి సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు ఒకేసారి రెండు ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు మూవీ హాట్ టాపిక్ గా మారింది.
జిగ్రీస్ ఓటీటీ

పాత మారుతి 800 కార్లో గోవా ట్రిప్ వెళ్లే నలుగురు ఫ్రెండ్స్ స్టోరీతో తెరకెక్కిన మూవీ జిగ్రీస్. ఇది నవంబర్ 14, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ తదితరులు నటించారు. ఈ మూవీ ఇప్పుడు సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ ట్రెండింగ్ లో
జిగ్రీస్ మూవీ ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లో అదరగొడుతోంది. ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సత్తాచాటుతోంది. సన్ నెక్ట్స్ లో జిగ్రీస్ సినిమా జనవరి 6, 2026న రిలీజైంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది ఈ తెలుగు సినిమా. టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
మరోవైపు ప్రైమ్ వీడియోలోనూ జిగ్రీస్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జనవరి 9న రిలీజైంది ఈ సినిమా. ఈ ఓటీటీలో నంబర్ 3 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది జిగ్రీస్.
అదిరే రెస్సాన్స్
ఓటీటీలో జిగ్రీస్ మూవీకి అదిరే రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ మూవీపై ప్రశంసలు దక్కుతున్నాయి. నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ అదిరిపోయిందని, కామెడీ కడుపుబ్బా నవ్విస్తోందని పోస్టులు పెడుతున్నారు. మస్ట్ వాచ్ సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్టర్. కృష్ణ వోడపల్లి ప్రొడ్యూసర్.
జిగ్రీస్ స్టోరీ
{{/usCountry}}ఓటీటీలో జిగ్రీస్ మూవీకి అదిరే రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ మూవీపై ప్రశంసలు దక్కుతున్నాయి. నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ అదిరిపోయిందని, కామెడీ కడుపుబ్బా నవ్విస్తోందని పోస్టులు పెడుతున్నారు. మస్ట్ వాచ్ సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీకి హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్టర్. కృష్ణ వోడపల్లి ప్రొడ్యూసర్.
జిగ్రీస్ స్టోరీ
{{/usCountry}}ప్రవీణ్ (రామ్ నితిన్), కార్తీక్ (కృష్ణ బురుగుల), ప్రశాంత్ (మణి వక్కా), వినయ్ (ధీరజ్) ఫ్రెండ్స్. జిగ్రీ దోస్తులు. ఈ నలుగురు కలిసి గోవా ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తారు. ఒక పాత మారుతి 800 కార్లో ట్రిప్ స్టార్ట్ చేస్తారు.
కానీ రోడ్ ట్రిప్ లో ఆ పాత కారుతో ఎన్నో సమస్యలు వస్తాయి. కారు ఆగిపోతుంది. దాన్ని రిపేర్ చేయిస్తూ ముందుకు వెళ్తారు. మరి చివరకు వీళ్లు గోవా చేరుకున్నారా? ఆ జర్నీలో కథ మలుపు ఎలాంటి తిరిగింది? అన్నది జిగ్రీస్ మూవీలో చూడాల్సిందే.