ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక మలయాళం సినిమాలు, సిరీస్ లపై తెలుగు ఆడియన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను ఎక్కువగా చూసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి మలయాళం సిరీస్ ‘రోస్లిన్’ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు జనాలు ఈ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు.
రోస్లిన్ ఓటీటీ

మలయాాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఉత్కంఠతో సాగుతోంది. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ రోస్లిన్ సిరీస్ లో మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్ తదితరులు నటించారు.
ట్రెండింగ్ నంబర్ వన్
రోస్లిన్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఇండియాలో నంబర్ వన్ సిరీస్ గా జియోహాట్‌స్టార్‌లో రోస్లిన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
దృశ్యం లాంటి టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ ను అందించిన డైరెక్టర్ జీతు జోసెఫ్.. ఈ రోస్లిన్ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరించాడు. రోస్లిన్ సిరీస్ కు సుమేష్ నందకుమార్ డైరెక్టర్.
రోస్లిన్ కథ
శోభ (మీనా), జాన్ (వినీత్) కుటుంబం చుట్టూ సాగే కథనే రోస్లిన్ వెబ్ సిరీస్. శోభ, జాన్ భార్యాభర్తలు. వీళ్లకు రోస్లిన్ (సంజన దీపు) అనే టీనేజ్ కూతురు, చిన్న పిల్లాడైన ఆరోన్ ఉంటారు. ఈ ఫ్యామిలీ రోజ్ వ్యాలీని చూసుకుంటూ అక్కడి బంగ్లాలో ఉంటారు. అయితే రోస్లిన్ తర్వాత పుట్టిన అలెన్ చనిపోతాడు. రోస్లిన్ ను ఈ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి.
{{/usCountry}}శోభ (మీనా), జాన్ (వినీత్) కుటుంబం చుట్టూ సాగే కథనే రోస్లిన్ వెబ్ సిరీస్. శోభ, జాన్ భార్యాభర్తలు. వీళ్లకు రోస్లిన్ (సంజన దీపు) అనే టీనేజ్ కూతురు, చిన్న పిల్లాడైన ఆరోన్ ఉంటారు. ఈ ఫ్యామిలీ రోజ్ వ్యాలీని చూసుకుంటూ అక్కడి బంగ్లాలో ఉంటారు. అయితే రోస్లిన్ తర్వాత పుట్టిన అలెన్ చనిపోతాడు. రోస్లిన్ ను ఈ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి.
{{/usCountry}}ఈ కథలో రోస్లిన్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆమెకు తరచుగా ఒకే రకమైన కల వస్తుంది. ఆకుపచ్చ రంగు కళ్లు కలిగిన ఓ వ్యక్తి తనను వెంటాడుతున్నట్లు, చంపాలని చూస్తున్నట్లు రోస్లిన్ కు కల వస్తుంది. ఈ విషయం అమ్మానాన్నకు చెప్తుంది. కానీ ఆమె చదివే నవలల కారణంగా ఇలాంటి కలలు వస్తున్నాయని చెప్పి ఊరుకుంటారు. అయితే ఒక రోజు జాన్ ఇంటికి జెర్రీ (హకీమ్ షాజహాన్) పెయింగ్ గెస్ట్ గా ఉండేందుకు వస్తాడు. తన కలలో వచ్చే వ్యక్తి జెర్రీనే అని రోస్లిన్ చెప్తుంది. కానీ ఎవరూ పట్టించుకోరు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు జెర్రీ ఎవరు? రోస్లిన్ ఎందుకు అంతలా భయపడుతుంది? అనేది రోస్లిన్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.