యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినిమా ‘దండోరా’ తెగ నచ్చేసింది. ఈ మూవీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంకేముంది.. దండోరా మూవీ పేరు తెగ వైరల్ గా మారింది. దెబ్బకు సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో టాప్-2లోకి దూసుకెళ్లింది. మీరు ఈ మూవీని చూశారా మరి!
ఎన్టీఆర్ ట్వీట్

దండోరా సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. మూవీ అద్భుతంగా ఉందంటూ తారక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇప్పుడే దండోరా చూశా. లోతుగా ఆలోచింపచేసే, పవర్ ఫుల్ మూవీ. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అసాధారణ ప్రదర్శన చేశారు.
బలమైన రైటింగ్ కు, ఇలాంటి స్టోరీని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినందుకు డైరెక్టర్ మురళీకాంత్ కు హ్యాట్సాఫ్. ఈ ప్రయత్నానికి అండగా నిలిచిన రవీంద్ర బెనర్జీకి కుడోస్. అద్భుతమైన మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
ఫ్యాన్ బాయ్ మూమెంట్
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పట్ల ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘అన్నా.. ఇది పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. మీ నుంచి ఇలాంటిది రావడం నాకెంతో ముఖ్యమైంది. ఇది మేం సాధించిన ఘనత. మా హంబుల్ అటెంప్ట్ ను మీరు ప్రేమించినందుకు ఆనందంగా ఉంది’’ అని రవీంద్ర పోస్టు పెట్టాడు. శివాజీ కూడా ధన్యవాదాలు చెప్పాడు.
దండోరా ఓటీటీ
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పట్ల ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘అన్నా.. ఇది పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. మీ నుంచి ఇలాంటిది రావడం నాకెంతో ముఖ్యమైంది. ఇది మేం సాధించిన ఘనత. మా హంబుల్ అటెంప్ట్ ను మీరు ప్రేమించినందుకు ఆనందంగా ఉంది’’ అని రవీంద్ర పోస్టు పెట్టాడు. శివాజీ కూడా ధన్యవాదాలు చెప్పాడు.
దండోరా ఓటీటీ
{{/usCountry}}సామాజిక డ్రామా మూవీగా థియేటర్లలోకి వచ్చిన దండోరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 25, 2025న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 14, 2026 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది దండోరా మూవీ.
ట్రెండింగ్ నం 2
ప్రైమ్ వీడియోలో దండోరా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ తో మరోసారి దండోరా పేరు వైరల్ గా మారింది. ఈ మూవీని చూసేందుకు ఆడియన్స్ ఓటీటీకి వరుస కట్టారు. దీంతో ఇండియాలో టాప్ 2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది దండోరా.
తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుల వివక్షను చాటే మూవీ దండోరా. ఇది తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దండోరా సినిమాకు మురళీకాంత్ డైరెక్టర్. రవీంద్ర ప్రొడ్యూసర్. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు వస్తున్నాయి.