వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఏం చూద్దామా అని సెర్చ్ చేస్తున్నారా? మీ కోసమే ఈ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లిస్ట్. జియోహాట్‌స్టార్‌లో అదరగొడుతున్న ఈ నాలుగు వెబ్ సిరీస్ లపై లుక్కేయండి. ఇందులో క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లున్నాయి. ఈ వీకెండ్ కు ఇవి బెస్ట్.
ఓటీటీ ట్రెండింగ్

జియోహాట్‌స్టార్ ఓటీటీ తెలుగులో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా నాలుగు వెబ్ సిరీస్ లే ఉన్నాయి. అవే.. ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘కాట్టాన్’, ‘రిసార్ట్’, ‘చిరాయా’. ఈ వెబ్ సిరీస్ లు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాయి.
విక్రమ్ ఆన్ డ్యూటీ
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నటించిన వెబ్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. ఇదో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ లో ఒక కేసును సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ గా నిఖిల్ నటించాడు. రియల్ లైఫ్ క్రైమ్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
కాట్టాన్
వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ ప్లే చేసిన సిరీస్ పేరు ‘కాట్టాన్’. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శుక్రవారం (మార్చి 27) ఓటీటీలో రిలీజైంది. ఒకేసారి 10 ఎపిసోడ్లు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చాయి.
కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసేయాలని చూస్తారు. అదే సమయంలో కొండ మీద మొండెం లేని తల ఒకటి దొరుకుతుంది. మరి ఆ తల ఎవరిది? దాని వెనుకాల కథ ఏంటీ? అన్నది కాట్టాన్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
రిసార్ట్
{{/usCountry}}కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసేయాలని చూస్తారు. అదే సమయంలో కొండ మీద మొండెం లేని తల ఒకటి దొరుకుతుంది. మరి ఆ తల ఎవరిది? దాని వెనుకాల కథ ఏంటీ? అన్నది కాట్టాన్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
రిసార్ట్
{{/usCountry}}జియోహాట్‌స్టార్‌లోని రిసార్ట్ సిరీస్ కూడా మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఓ రిసార్ట్ లోని హోటల్లో పని చేసే సర్వీస్ బాయ్ కథ ఇది. అతను ఎప్పటికైనా మంచి చెఫ్ గా ఎదగాలని అనుకుంటాడు. హోటల్ కిచెన్ లో వంట చేయాలని కల కంటాడు. కానీ అందుకు హెడ్ చెఫ్ ఒప్పుకోడు. పైగా అవమానిస్తాడు. మరి ఆ కుర్రాడు ఏం చేశాడన్నది ఈ రిసార్ట్ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
చిరాయా
మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన సిరీస్ పేరు ‘చిరాయా’. ఇందులో దివ్యా దత్తా ప్రధాన పాత్ర పోషించింది. ఆమె మరిది ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి సెక్స్ అంటే భయం. ఆ విషయాన్ని పట్టించుకోకుండా అతను మృగంలా బిహేవ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వదిన అతనికి ఎలా బుద్ధి చెప్పిందన్నదే చిరాయా వెబ్ సిరీస్.