వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? మీకు రెండు రోజులకు సరిపడా వినోదం అందించడానికి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలో సిద్దంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలు, సిరీస్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఈషా - అమెజాన్ ప్రైమ్ వీడియో

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా నలుగురు స్నేహితులు.. మూడు రోజుల పాటు ఓ దెయ్యాల కొంపలో ఎలా ఉన్నారనే కథ చుట్టూ తిరుగుతుంది.
హాట్ స్పాట్ 2 మచ్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇదో తమిళ మూవీ. ఇది ప్రైమ్ వీడియోతోపాటు మరో ఐదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చింది. రెండేళ్ల కిందట వచ్చిన హాట్ స్పాట్ సినిమాకు ఇది సీక్వెల్. కాస్త బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళం, హిందీ ఆడియోలలోనే అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ లేదు.
తూ మేరీ మై తేరా మై తేరీ తూ మేరా - అమెజాన్ ప్రైమ్ వీడియో
హిందీ మూవీ తూ మేరీ మై తేరా మై తేరీ తూ మేరా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటించిన మూవీ ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
లక్కీ: ది సూపర్ స్టార్ - జియోహాట్‌స్టార్
తమిళ కామెడీ సినిమా లక్కీ: ది సూపర్ స్టార్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగుతోపాటు మొత్తంగా ఏడు భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఓ తప్పిపోయిన కుక్క పిల్ల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
నే జా 2 - జియోహాట్‌స్టార్
{{/usCountry}}తమిళ కామెడీ సినిమా లక్కీ: ది సూపర్ స్టార్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగుతోపాటు మొత్తంగా ఏడు భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఓ తప్పిపోయిన కుక్క పిల్ల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
నే జా 2 - జియోహాట్‌స్టార్
{{/usCountry}}ప్రపంచంలోనే అత్యధిక వసూళ్ల యానిమేషన్ మూవీ నే జా 2. ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మాండరిన్, ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
కెన్నెడీ - జీ5 ఓటీటీ
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన కెన్నెడీ మూవీ నేరుగా ఓటీటీలోకే వచ్చింది. సన్నీ లియోనీ ఇందులో నటించడం విశేషం. ఇదో నియో నాయిర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.
పాతిరాత్రి - జీ5 ఓటీటీ
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి కూడా ఇదే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇద్దరు పోలీసులకు ఓ రాత్రి పెట్రోలింగ్ లో ఎదురయ్యే ఓ ఘటన వాళ్ల జీవితాలను ఎలా మార్చేసిందన్న కథతో తెరకెక్కింది.
రాక్షస వెబ్ సిరీస్ - జీ5 ఓటీటీ
ఇదో కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జీ5 ఓటీటీలోకి వచ్చింది. మొసలి చంపుతుందా లేక ఓ సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా తెలియని పరిస్థితుల్లో ఓ ఊళ్లో వరుసగా జరిగే హత్యలు కలకలం రేపుతుంటాయి.
3 రోజెస్ సీజన్ 2 - ఆహా తమిళం
తమిళ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆహా తమిళం ఓటీటీలో ఈ కొత్త సీజన్ ను చూడచ్చు.
ఒండిమునియం నల్లపాదనుమ్ - సన్ నెక్ట్స్
ఇది కూడా ఓ తమిళ కామెడీ డ్రామా. సన్ నెక్ట్స్ ఓటీటీలోకి ఈ వారం అడుగుపెట్టింది. కేవలం తమిళ ఆడియోతోనే అందుబాటులో ఉంది.
అమోజ్ అలెగ్జాండర్ - సన్ నెక్ట్స్
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమోజ్ అలెగ్జాండర్. ఇది కూడా సన్ నెక్ట్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ జంట, ఓ రేపిస్ట్ చుట్టూ తిరిగే కథ ఇది.
చత్తా పచ్చ - నెట్‌ఫ్లిక్స్
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ చత్తా పచ్చ. మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ నేపథ్యంలో సాగే కథ ఇది.