...
...
Next Story

Pakistan Singer: నా పాట వాడుకున్నందుకు 50 వేల డాలర్లు ఇచ్చారు.. అనుమతి కూడా తీసుకున్నారు: ధురంధర్‌పై పాకిస్థానీ సింగర్

Pakistan Singer: ధురంధర్ మూవీలో తన పాట వాడుకున్నందుకు మేకర్స్ తనకు 50 వేల డాలర్లు ఇచ్చారని చెప్పాడు పాకిస్థానీ సింగర్ హసన్ జహంగీర్. అది విని ఆ ప్రశ్న అడిగిన యాంకర్ షాక్ తిన్న వీడియో వైరల్ అవుతోంది.

Published on: Mar 16, 2026, 12:18:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రణవీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రెట్రో సాంగ్స్ (పాత పాటలు) వాడకం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చిపెట్టింది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు హసన్ జహంగీర్.. తన ఐకానిక్ సాంగ్ 'హవా హవా' (Hawa Hawa) హక్కుల కోసం ధురంధర్ మేకర్స్ తనకు భారీ మొత్తాన్ని చెల్లించారని వెల్లడించాడు.

50,000 డాలర్లు చెల్లించిన మేకర్స్

Pakistan Singer: నా పాట వాడుకున్నందుకు 50 వేల డాలర్లు ఇచ్చారు.. అనుమతి కూడా తీసుకున్నారు: ధురంధర్‌పై పాకిస్థానీ సింగర్
Pakistan Singer: నా పాట వాడుకున్నందుకు 50 వేల డాలర్లు ఇచ్చారు.. అనుమతి కూడా తీసుకున్నారు: ధురంధర్‌పై పాకిస్థానీ సింగర్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హసన్ జహంగీర్.. ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ టీమ్ తన పాటను వాడుకోవడానికి అధికారికంగా అనుమతి తీసుకున్నారని తెలిపాడు. ఈ పాట హక్కుల కోసం తనకు 50,000 డాలర్లు (సుమారు రూ. 45 లక్షలు) చెల్లించినట్లు అతడు ధృవీకరించాడు.

"గతంలో కాపీరైట్ వ్యవస్థ అంత బలంగా లేదు. కానీ ఇప్పుడు నా పాటలు ఎవరు వాడాలన్నా ముందుగా పర్మిషన్ తీసుకుంటున్నారు. డబ్బు కూడా చెల్లిస్తున్నారు" అని అతడు పేర్కొన్నాడు. నిజంగానే ఇచ్చారా అని ఈ ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ ప్రశ్నించగా.. నిజంగానే అంత డబ్బు ఇచ్చారని, తన అనుమతి కూడా తీసుకున్నారని అతడు వెల్లడించాడు. 1987లో విడుదలైన ఈ సాంగ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కూడా నేటి తరాన్ని ఉర్రూతలూగిస్తోంది.

సంజయ్ దత్ మాస్ ఎంట్రీ

'ధురంధర్' సినిమాలో ఈ పాట ఎక్కడ వస్తుందో తెలుసా? ఎడారి నేపథ్యంలో ఎస్పీ అస్లాం (సంజయ్ దత్) డ్రగ్ పెడ్లర్లను ఎదుర్కొనే సీన్‌లో ఈ 'హవా హవా' పాట ప్లే అవుతుంది. సంజయ్ దత్ తనదైన శైలిలో విలన్లను మట్టికరిపిస్తుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ రెట్రో సాంగ్ రావడం ప్రేక్షకులకు అదిరిపోయే కిక్ ఇచ్చింది.

గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’.. బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా, కేవలం భారత బాక్సాఫీస్ వద్దే రూ. 1,000 కోట్లు దాటిన మొదటి బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది.

ఇది ఒక ఇండియన్ స్పై కరాచీ అండర్‌వరల్డ్‌లోకి చొరబడి చేసే ఆపరేషన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. 26/11 ముంబై దాడులు, పార్లమెంట్ దాడి వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు.

ధురందర్ సీక్వెల్ - పవన్ కళ్యాణ్‌తో పోటీ

'ధురంధర్' సీక్వెల్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదట ఇది కన్నడ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' (Toxic) తో తలపడుతుందని అనుకున్నా.. ఆ సినిమా జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ కు గట్టి పోటీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) నిలుస్తోంది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe