OTT Thriller Telugu: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు థ్రిల్లర్ డ్రామా.. పెళ్లికి ముందు ముఖం చూపిస్తే మరణం.. ఎక్కడ చూడాలంటే?
Paradha OTT Streaming: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సోషల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం పరదా ఓటీటీలో అదరగొడుతోంది. వింత ఆచారాలు, స్త్రీ స్వేచ్ఛ చుట్టూ సాగే ఈ సినిమాలో దర్శనా రాజేంద్రన్, సంగీత మరో కీలక పాత్రలు పోషించారు. మరి పరదా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
OTT Telugu Social Thriller Drama Streaming: పెళ్లికి ముందు పరాయి పురుషుడికి ముఖం చూపిస్తే మరణశిక్ష విధించే వింత ఆచారం ఉన్న ఒక గ్రామం. ఊహకందని ఈ కట్టుబాటు నేపథ్యంగా తెరకెక్కిన తెలుగు సోషల్ డ్రామా చిత్రమే 'పరదా'.

ఓటీటీలో ఆకట్టుకుంటోన్న పరదా
బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్, మలయాళ భామ దర్శనా రాజేంద్రన్, సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన పరదా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. సంప్రదాయాలు, స్త్రీ స్వేచ్ఛ మధ్య జరిగే ఘర్షణను ప్రతిబింబించే పరదా ఓటీటీ వాచ్‌రి బెస్ట్ ఆప్షన్.
ఆచారాల ముసుగులో వింత ప్రపంచం.. అసలు కథేంటి?
పడతి అనే ఒక మారుమూల గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఆ ఊరి నియమాల ప్రకారం మహిళలు ఎల్లప్పుడూ ముసుగు (పరదా)లోనే ఉండాలి. పరాయి మగవాడు వారి ముఖాన్ని చూస్తే గ్రామ దేవత 'జ్వాలాంబిక' శాపంతో ఊళ్లో గర్భిణీలకు పుట్టే పిల్లలు చనిపోతారనే మూఢనమ్మకాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అలాగే, అలా పెళ్లికి ముందు మొహం చూపిస్తే వారికి మరణశిక్ష కూడా విధిస్తారు.
ఊరి కట్టుబాట్లను దైవసమానంగా భావించే అమాయకపు పల్లెటూరి అమ్మాయి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్). సుబ్బు జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెకు తెలియకుండానే ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై సుబ్బు ఫోటో ప్రింట్ అయి వస్తుంది. ఆ ఫోటోను గ్రామస్థులు చూడటంతో సుబ్బు జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలమవుతుంది. దాంతో ఆమె పెళ్లి ఆగిపోతుంది. ఆచారాల పేరుతో సమాజం వేసే ప్రశ్నలను ఎదుర్కొంటూ ఆమె తన ఆత్మగౌరవాన్ని సుబ్బు ఎలా కాపాడుకుంది అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.
అనుపమ, దర్శనల నటన.. పాత్రల్లో లీనం!
పరదా చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తన నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. అమాయకపు గ్రామీణ యువతిగా మొదలై, పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే ధీరగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కట్టుబాట్లలో నలిగిపోయే బాధను, స్వేచ్ఛను కోరుకునే తపనను ఆమె కళ్లలోనే ఆవిష్కరించారు.
మరో కీలక పాత్రలో నటించిన దర్శనా రాజేంద్రన్ (అమిష్ట) నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రశ్నించే తత్వంతో, స్త్రీ హక్కుల కోసం పోరాడే స్వతంత్ర భావాలు కలిగిన పాత్రలో ఆమె ఒదిగిపోయారు. సుబ్బు అత్తగా సంగీత క్రిష్ తనదైన శైలిలో మెప్పించగా, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్ధన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిన్న క్యామియో రోల్‌తో అలరించారు.
బలాలు, బలహీనతలు.. చూడొచ్చా?
సంప్రదాయాల పేరుతో మహిళలపై రుద్దే ఆంక్షలు, వారి అంగీకారం (Consent) ప్రాముఖ్యతను పరదా సినిమా బలంగా ప్రశ్నిస్తుంది. ప్రథమార్ధం వేగంగా సాగుతూ ప్రేక్షకునిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదించి, అక్కడక్కడా ప్రధాన ఇతివృత్తం నుంచి పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది.
ఏదేమైనా, రెగ్యుయలర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సామాజిక స్పృహతో కూడిన కథలను ఆదరించే వారికి 'పరదా' మంచి అనుభూతిని ఇస్తుంది. మన సమాజంలోని మూఢనమ్మకాలపై ఆలోచింపజేసే ఈ సినిమా పరదాను ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.
పరదా ఓటీటీ స్ట్రీమింగ్
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో పరదా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు మలయాళం వంటి రెండు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అనుపమ పరమేశ్వరన్, దర్శనా, సంగీత ముగ్గురు హీరోయిన్ల పరదా ఓటీటీ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


