Netflix Thriller: 'షాక్' (Shaque) వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రెడీ అయింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రిపోర్టింగ్ లైవ్' (Reporting Live) మూవీతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
రిపోర్టింగ్ లైవ్ ఓటీటీ

ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రిపోర్టింగ్ లైవ్’ చిత్రం అక్టోబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో పరిణీతి చోప్రా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటుడు దేవేన్ భోజానీ కీలకమైన కెమెరామన్ పాత్రను పోషించారు.
ఇసుక మాఫియా గుట్టు
నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ప్రసారమయ్యే 'రిపోర్టింగ్ లైవ్' సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.
ఒక ఆంబిషియస్ యంగ్ రిపోర్టర్ (పరిణీతి చోప్రా) తన అనుభవజ్ఞుడైన కెమెరామన్ (దేవేన్ భోజానీ)తో కలిసి ఒక డార్క్ నెట్‌వర్క్‌ను ఛేదించే క్రమంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న ఇసుక మాఫియా సీక్రెట్స్ వెలుగులోకి తెస్తుంది. ఆ కథను బయటపెట్టే కొద్దీ అత్యంత క్రూరమైన మాఫియా సామ్రాజ్యం నుంచి ఎలాంటి ప్రాణాపాయం ఎదురైంది, ఆ సుడిగుండం నుంచి వారు ఎలా బయటపడ్డారనే సస్పెన్స్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
7 ఏళ్ల నిరీక్షణ
ఈ రిపోర్టింగ్ లైవ్ చిత్రం గురించి దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఏడేళ్ల పాటు ఈ కథపై వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశానని తెలిపారు. గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే పరిణీతి చోప్రా, దేవేన్ భోజానీల కాంబినేషన్ ఇప్పటివరకు స్క్రీన్ పై రాని సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.
{{/usCountry}}ఈ రిపోర్టింగ్ లైవ్ చిత్రం గురించి దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఏడేళ్ల పాటు ఈ కథపై వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశానని తెలిపారు. గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో రూపొందిన ఈ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే పరిణీతి చోప్రా, దేవేన్ భోజానీల కాంబినేషన్ ఇప్పటివరకు స్క్రీన్ పై రాని సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.
{{/usCountry}}పార్థ కిరణ్ ఠాకూర్, జోషువా షిర్సాత్ నిర్మించిన ఈ రిపోర్టింగ్ లైవ్ సినిమాలో అమోల్ పాలేకర్, ఆదిల్ హుస్సేన్, శేఖర్ సుమన్, నాజర్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు.
రియలిస్టిక్ థ్రిల్లర్స్
ఓటీటీ వేదికలలో ఇటీవల కాలంలో రియలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు, సోషల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్ డ్రామాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సమాజంలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలు, మాఫియా అంశాలను కథగా తీసుకున్న రిపోర్టింగ్ లైవ్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి.
పరిణీతి చోప్రా 'షాక్' సిరీస్ ద్వారా ఆల్రెడీ డిజిటల్ ఆడియన్స్‌కు చేరువవ్వగా, ఇప్పుడు 'రిపోర్టింగ్ లైవ్' లోని సీరియస్ జర్నలిస్ట్ రోల్ ఆమె నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనుంది. నాజర్, ఆదిల్ హుస్సేన్ లాంటి పవర్ హౌస్ యాక్టర్స్ ఉండటం వల్ల అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ మూవీ అదరగొట్టే ఛాన్స్ ఉంది.