...
...
Next Story

Trisha Parthiban: త్రిషకు సారీ చెప్పిన పార్థిబన్- కానీ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు-తప్పు, తప్పుడు పని అంటూ 8 నిమిషాల వీడియో

Parthiban Sorry To Trisha: అవార్డుల వేడుకలో హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని చెబుతూ క్షమాపణలు కోరారు. అలాగే పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు పార్తిబన్.

Published on: Mar 10, 2026, 13:19:31 IST
Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, దర్శకుడిగా పేరున్న ఆర్. పార్థిబన్, హీరోయిన్ త్రిష కృష్ణన్ మధ్య మొదలైన 'మాటల యుద్ధం' కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఒక అవార్డు వేడుకలో త్రిష గురించి పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.

త్రిషకు సారీ చెప్పిన పార్థిబన్- కానీ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు-తప్పు, తప్పుడు పని అంటూ 8 నిమిషాల వీడియో
త్రిషకు సారీ చెప్పిన పార్థిబన్- కానీ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు-తప్పు, తప్పుడు పని అంటూ 8 నిమిషాల వీడియో

దీనిపై త్రిష కృష్ణన్ కూడా ఘాటుగా స్పందించడంతో, తాజాగా పార్థిబన్ దాదాపు ఎనిమిది నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసి తన వివరణ ఇచ్చారు. అందులో త్రిషకు పార్థిబన్ క్షమాపణలు చెప్పారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఆదివారం (మార్చి 8) జరిగిన ఒక కార్యక్రమంలో పార్థిబన్ మాట్లాడుతూ.. 'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష పోషించిన కుందవై పాత్రను ప్రస్తావించారు. "ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే కూర్చోవాలి" అంటూ పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై త్రిష ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు.

"మైక్రోఫోన్ దొరికినంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగానో, హాస్యంగానో మారిపోవు. అది కేవలం మూర్ఖత్వాన్ని మాత్రమే బిగ్గరగా వినిపిస్తుంది" అంటూ పార్థిబన్ పేరు ఎత్తకుండానే చురకలు అంటించారు త్రిష. తన ఫోటోను స్క్రీన్‌పై ప్రదర్శించాలని పార్థిబన్ తన అసిస్టెంట్ ద్వారా నిర్వాహకులను కోరారని కూడా త్రిష ఆరోపించారు.

"అది తప్పు కాదు.. పొరపాటు మాత్రమే"

తన వీడియో స్టేట్‌మెంట్‌లో పార్థిబన్ మాట్లాడుతూ, తెలిసి చేసేది తప్పు, తెలియక జరిగేది పొరపాటు అని విజయ్‌తో త్రిష పెళ్లి వేడుకకు వెళ్లడాన్ని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు. "నేను ఎవరినీ కించపరచాలని ఆ మాటలు అనలేదు. విజయ్, అజిత్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా స్క్రీన్‌పై త్రిష ఫోటో కనిపించింది. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆమె ఫోటో వేయమని నేను అడిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం" అని పార్థిబన్ స్పష్టం చేశారు.

అలాగే, త్రిష పోస్టుపై పార్థిబన్ అసహనం వ్యక్తం చేశారు. స్టేజీపై తాను ఆ మాట అనాల్సింది కాదని, తన తప్పును ఒప్పుకుంటూ త్రిష చేసిన పోస్టుు థర్డ్ రేటెడ్ ట్వీట్ అంటూ పార్థిబన్ అభివర్ణించారు. ఇతర సందర్భాల్లో ఎదుర్కొన్న అసభ్యకర విమర్శలపై త్రిష స్పందించి ఉంటే.. తనపై చేసిన విమర్శలను కూడా స్వాగతించేవాడినని పార్థిబన్ చెప్పారు.

క్షమాపణలు చెప్పిన దర్శకుడు

తాను వేదిక దిగి రాగానే సీనియర్ జర్నలిస్ట్ రంగరాజ్ పాండే ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని సూచించారని పార్తిబన్ తెలిపారు. వెంటనే ఆ క్లిప్పింగ్‌ను తొలగించాలని నిర్వాహకులను కోరినప్పటికీ, అప్పటికే అది సోషల్ మీడియాలోకి వెళ్లిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

"జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నా మాటలను తప్పుగా వక్రీకరించడం బాధ కలిగించింది. ఒకవేళ నేను పొరపాటు చేస్తే దానిని అంగీకరించడానికి నాకు ఎప్పుడూ మొహమాటం ఉండదు" అని పార్థిబన్ తన స్టేట్‌మెంట్‌ను ముగించారు.

త్రిష రియాక్షన్ ఎలా ఉంటుందో?

ఓవైపు త్రిషకు సారీ చెబుతూనే మరోవైపు తాను చేసిన పనిపై సెటైర్లు వేశారు పార్థిబన్. మరి ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ త్రిష ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks