Pawan Kalyan: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే

Pawan Kalyan: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర పురుడు పోసుకుంది. విజయ్ దళపతి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్ గా మారింది.

Published on: May 10, 2026, 15:28:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు తిరు విజయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

విజయ్, పవన్ కళ్యాణ్
విజయ్, పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రియాక్షన్

తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌తో పాటు, ఆయన మంత్రివర్గ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.

వైరల్ పోస్ట్

"తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు విజయ్ కు, అలాగే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు" అని పవన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన కోరారు.

సుపరిపాలనపై ఆకాంక్ష

తమిళనాడును ప్రగతిపథంలో నడిపించే విషయంలో విజయ్ సర్కార్ కీలకంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పారదర్శకమైన, డెవలప్మెంట్ విధానాలతో కూడిన పరిపాలనను అందించాలని, తద్వారా తమిళనాడు రాష్ట్రం మరింత వృద్ధిని, సుభిక్షాన్ని సాధించాలని ఆయన తన సందేశంలో వెల్లడించారు.

సినిమా రంగం నుంచి

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, అట్టడుగు స్థాయి నుంచి పార్టీని నిర్మించి అధికార పీఠాన్ని అధిరోహించిన విజయ్ ప్రస్థానం ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల బరిలో దిగిన విజయ్ విజయకేతనం ఎగురవేశారు.

పవన్ కళ్యాణ్ ఇలా

తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనాలకు సేవ చేయాలని జన సేన పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.

ఇటు ఏపీలో, అటు తమిళనాడులో ఇద్దరు అగ్ర నటులు ఇప్పుడు రాజకీయ నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

జవాబు: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రశ్న: విజయ్ ప్రమాణస్వీకారంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

జవాబు: విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, పారదర్శకమైన పాలన అందించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ప్రశ్న: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఎన్ని స్థానాలు గెలిచింది?

జవాబు: ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More