Peddi 10 Days Worldwide Box Office Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.
3 వేల స్క్రీన్లు

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదలైన పెద్ది సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రారంభంలో మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
82 లక్షల టికెట్లు
ఫలితంగా పెద్ది చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 20 కోట్ల వసూళ్లను రాబట్టి, ఏకంగా 82 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్‌కు అద్దం పడుతోంది. మొదటి రోజే దేశీయంగా రూ. 40.66 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం వీక్‌డేస్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, వీకెండ్ వచ్చేసరికి మళ్లీ పుంజుకుంది.
రెండో వీకెండ్‌లో పెద్ది కలెక్షన్ల జోరు
మొదటి సోమవారం (జూన్ 8) నాడు రూ. 12.35 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఆ తర్వాత రోజుల్లో కొద్దిగా మందగించింది. అయితే, రెండో వీకెండ్ ప్రారంభం కాగానే బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపు అందుకుంది. గురువారం (జూన్ 11) రూ. 6.30 కోట్లు, శుక్రవారం (జూన్ 12) రూ. 5.15 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో శనివారం (10వ రోజు-జూన్ 13) ఏకంగా రూ. 7.86 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది.
పెద్ది ఇండియన్ కలెక్షన్స్
దీంతో ఇప్పటివరకు భారతదేశంలో పెద్ది పది రోజుల గ్రాస్ కలెక్షన్లు రూ. 245.25 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, 10 రోజుల ఇండియా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 206.56 కోట్లు దాటేసింది పెద్ది మూవీ. ఈ భారీ వసూళ్లతో కోలీవుడ్ హిట్ చిత్రం 'కరుప్పు' రికార్డులను తిరగరాసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా 'పెద్ది' అవతరించింది.
పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
{{/usCountry}}దీంతో ఇప్పటివరకు భారతదేశంలో పెద్ది పది రోజుల గ్రాస్ కలెక్షన్లు రూ. 245.25 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, 10 రోజుల ఇండియా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 206.56 కోట్లు దాటేసింది పెద్ది మూవీ. ఈ భారీ వసూళ్లతో కోలీవుడ్ హిట్ చిత్రం 'కరుప్పు' రికార్డులను తిరగరాసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా 'పెద్ది' అవతరించింది.
పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
{{/usCountry}}అలాగే, వరల్డ్ వైడ్‌గా 10 రోజుల్లో పెద్ది సినిమాకు రూ. 366 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఒకవైపు కమర్షియల్‌గా సక్సెస్ సాధిస్తున్నప్పటికీ, మరోవైపు వివాదాల్లోనూ నిలిచింది.
సీన్లను తొలగిస్తున్నట్లుగా ప్రకటన
పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సాన చాలా పరిణతితో స్పందించారు. వివాదాస్పదమైన, ఇబ్బందికరంగా ఉన్న కొన్ని సీన్లను థియేటర్ల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.