Peddi 2 Days Worldwide Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' థియేటర్లలో కాసుల వేట కొనసాగిస్తోంది. జూన్ 3న జరిగిన గ్రాండ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
100 కోట్ల మైలురాయికి

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్ది చిత్రం మొదటి రోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను చాటింది. రెండో రోజు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, వీకెండ్ కాకముందే ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయికి అత్యంత చేరువగా రావడం విశేషం.
రెండు రోజుల అధికారిక వసూళ్లు ఇవే
ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, ‘పెద్ది’ చిత్రం రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో పెద్ది రెండు రోజుల మొత్తం దేశీయ వసూళ్లు రూ.96.40 కోట్లకు చేరాయి.
శుక్రవారం (జూన్ 5) నాడు దేశవ్యాప్తంగా ప్రదర్శించిన 10,113 షోలలో పెద్ది సినిమా 32.7 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పోర్ట్స్ డ్రామా ‘చందు ఛాంపియన్’ సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ.63.57 కోట్లు) పెద్ది చిత్రం కేవలం 2 రోజుల్లోనే దాటేయడం విశేషం.
ఉత్తరాదిన చప్పగా.. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో రామ్ చరణ్‌కు నార్త్ ఇండియాలో భారీ క్రేజ్ వచ్చినప్పటికీ, జాన్వీ కపూర్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ లాంటి హిందీ నటులు ఈ సినిమాలో ఉన్నా కూడా ఉత్తరాది కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి.
రెండో రోజు తెలుగు వెర్షన్ నుంచే రూ.23.39 కోట్ల వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ నుంచి కేవలం రూ.2.02 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు బుధవారం నాటి ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా రూ.18.50 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
{{/usCountry}}రెండో రోజు తెలుగు వెర్షన్ నుంచే రూ.23.39 కోట్ల వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ నుంచి కేవలం రూ.2.02 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు బుధవారం నాటి ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా రూ.18.50 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
{{/usCountry}}మొదటి రోజు గురువారం నాడు 12,412 షోలలో 45.5 శాతం ఆక్యుపెన్సీతో రూ.51 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లో ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ (రూ.167.46 కోట్లు) చిత్రంతో పెద్ది పోటీ పడాల్సి వస్తోంది.
సోలో హీరోగా చరణ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' రెండు రోజుల్లో దేశీయంగా రూ.72.60 కోట్లు వసూలు చేయగా, పెద్ది చిత్రం ఆ రికార్డును సులువుగా దాటేసింది. అయితే 'ఆర్‌ఆర్‌ఆర్' సాధించిన రెండు రోజుల రికార్డు కలెక్షన్ల (రూ.216.7 కోట్లు) కంటే ఇది వెనుకబడి ఉంది. అయితే, సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పెద్ది నిలిచింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో క్రీడల నేపథ్యంలో సాగే పెద్ది అనే యువకుడి కథను దర్శకుడు బుచ్చిబాబు సాన వెండితెరపై ఆవిష్కరించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి ఆటల ద్వారా తనను తాను నిరూపించుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే పాత్రలో చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
బడ్జెట్ అండ్ 2 డేస్ కలెక్షన్స్
కాకపోతే అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. రెండు రోజుల్లో పెద్ది సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 150 కోట్లు, ఇండియాలో రూ. 114 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం పెద్ది సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.400-450 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాలి. అంటే, పెద్ది సినిమాకు ఇంకా సుమారుగా రూ. 290 కోట్ల నెట్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుందని తెలుస్తోంది.
వాటికంటే ఎక్కువ కలెక్షన్స్
ఈ ఏడాది బాక్సాఫీస్ రేసులో టాప్ ప్లేస్ సాధించాలంటే ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. శని, ఆదివారాల్లో వచ్చే కలెక్షన్లు ఈ సినిమా లాంగ్ రన్‌ను డిసైడ్ చేయనున్నాయి.