టాలీవుడ్‌లో లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా 'శ్రీ చిదంబరం గారు'. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు. అలాగే, శ్రీ చిందబరం గారు సినిమాకు చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.
శ్రీ చిదంబరం టీజర్‌కు మంచి స్పందన

'శ్రీ చిదంబరం గారు' సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే, ఇటీవల శ్రీ చిదంబరం గారు మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది.
కీరవాణి ఆలపించిన వెళ్లేదారిలో పాట
కాగా శ్రీ చిదంబరం గారు చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే బ్యూటిఫుల్ పాటను సైతం రీసెంట్‌గా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ సాంగ్ కూడా టాలీవుడ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన
ఇదే క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా శ్రీ చిదంబరం గారు సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పెద్ది అనే పాన్ ఇండియా చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు సాన శ్రీ చిదంబరం గారు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలా
మూవీ ట్రైలర్‌ను గమనిస్తే.. శ్రీ చిదంబరం గారు ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్షియల్ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్ సందేశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచేవిధంగా ఉంది.
కొత్తవాళ్లతో తీసిన సినిమా
{{/usCountry}}మూవీ ట్రైలర్‌ను గమనిస్తే.. శ్రీ చిదంబరం గారు ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్షియల్ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్ సందేశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచేవిధంగా ఉంది.
కొత్తవాళ్లతో తీసిన సినిమా
{{/usCountry}}శ్రీ చిదంబరం గారు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "అంతా కొత్తవాళ్లతో తీసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది" అని అన్నారు.
మీ లోపం బలం అవ్వాలి
"చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మెకం ఉంది" అని శ్రీ చిదంబరం గారు నిర్మాతలు పేర్కొన్నారు.
శ్రీ చిదంబరం గారు నటీనటులు
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 6న శ్రీ చిదంబరం గారు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఈ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.