...
...
Next Story

Peddi Twitter Review: పెద్ది ట్విట్టర్ రివ్యూ.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో.. బుచ్చిబాబు రెండో సినిమా టాక్ ఎలా ఉందంటే?

Ram Charan Peddi Movie Twitter Review: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ప్రీమియర్ షోల టాక్ వచ్చేసింది. థియేటర్లలో అభిమానుల హంగామా నడుస్తుండగా, సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో పెద్ది ట్విట్టర్ రివ్యూలలో చూద్దాం.

Published on: Jun 4, 2026, 06:02:20 IST
Advertisement

Ram Charan Peddi Twitter Review Telugu: ఈ వేసవి కాలంలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 4 అంటే ఇవాళ థియేటర్లలో పెద్ది మూవీ రిలీజ్ కానుంది.

పెద్ది ట్విట్టర్ రివ్యూ.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో.. బుచ్చిబాబు రెండో సినిమా టాక్ ఎలా ఉందంటే?
పెద్ది ట్విట్టర్ రివ్యూ.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో.. బుచ్చిబాబు రెండో సినిమా టాక్ ఎలా ఉందంటే?

కానీ, జూన్ 3 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ పెద్ది ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఏఆర్ రెహమాన్ సంగీతంతో 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాపై సోషల్ మీడియా వేదికగా టాక్ ఏంటో పెద్ది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

ఇంటర్వెల్ బ్లాస్టింగ్.. ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

పెద్ది సినిమా ప్రథమార్ధంపై సోషల్ మీడియాలో ఎక్కువ శాతం సానుకూల స్పందన కనిపిస్తోంది. సాధారణ కథాంశంతోనే సినిమా మొదలైనప్పటికీ, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయని నెటిజన్లు చెప్తున్నారు.

ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్ట్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయట. ఇంటర్వెల్ బ్లాక్‌లో చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆయన బాడీ బిల్డింగ్ లుక్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు.

పాటల విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'రయ్ రయ్ రారా', 'చికిరి చికిరి' సాంగ్స్‌లో రామ్ చరణ్ మాస్ డాన్స్ స్టెప్పులు మెస్మరైజ్ చేశాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్ మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా నిలిచింది. అయితే, ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ అంతగా వర్కవుట్ కాలేదని, స్క్రీన్‌ప్లే అక్కడక్కడ కాస్త నెమ్మదించిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెకండాఫ్‌లో ఎమోషనల్ రోలర్ కోస్టర్.. ఢిల్లీ ఫైట్స్!

నైట్ క్రికెట్ మ్యాచ్ సీన్స్, పహిల్వాన్ ఫైట్ సీక్వెన్సులు థియేటర్లను ఊపేశాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన అందరినీ ఏడిపించేలా ఉందంటూ మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

"పెద్ది ఒక స్వచ్ఛమైన సినిమాటిక్ మాస్టర్ పీస్. రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్‌లో ఉంది, ఆన్‌లైన్ నెగిటివ్ రివ్యూలు నమ్మకండి" అని ఒక మెగా అభిమాని రాసుకొచ్చారు. మరోవైపు, పెద్ది సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉండటం, కొన్ని చోట్ల రోటీన్ కమర్షియల్ ఫార్మాట్ అనుసరించడం మైనస్ పాయింట్లుగా మారాయని సగటు సినిమా లవర్స్ చెప్తున్నారు. హిందీ బెల్ట్‌లో ఈ చిత్రానికి బజ్ కాస్త తక్కువగా ఉండటంతో అక్కడ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

నటీనటుల ప్రదర్శన.. టెక్నికల్ వాల్యూస్

రామ్ చరణ్ ఈ సినిమాను తన భుజాలపై మోసారనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు నటన అద్భుతంగా ఉందని, ఆయన క్యారెక్టర్ చాలా ఎమోషనల్ డెప్త్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది.

శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

తమిళ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం ఒక 'కల్ట్ క్లాసిక్' కానుందని ప్రముఖ సినీ క్రిటిక్ రమేశ్ బాలా పేర్కొన్నారు. అయితే స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఉమైర్ సంధు నెగెటివ్ రివ్యూ

కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, రామ్ చరణ్ నటన, రెహమాన్ మ్యూజిక్ కోసం పెద్ది చిత్రాన్ని థియేటర్లలో హ్యాపీగా చూడవచ్చు. జీరో సోల్‌తో ఉన్న అందమైన బాడీ అని, మాస్ ఎంటర్‌టైనర్‌ను ఎలా తెరకెక్కించాలో తెలుగు డైరెక్టర్స్ మర్చిపోయారని, రామ్ చరణ్ ఛార్మ్ ముగిసిపోయిందని అని నెగెటివ్ రివ్యూ ఇచ్చారు ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe