...
...
Next Story

Who Is Kruthika: బుల్లితెర బ్యూటీ.. అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఈ కృతిక‌ ఎవరు? కుర్రాళ్ల కలల రాణిగా భామ.. రెమ్యునరేషన్?

Who Is Kruthika: స్టార్ మాలో వస్తున్న కామెడీ కుకింగ్ షో ‘కూకు విత్ జాతిరత్నాలు’లో సందడి చేస్తున్న కృతిక‌ ఎవరు? క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, కళ్లు తిప్పుకోనివ్వని అందంతో అట్రాక్ట్ చూస్తున్న ఈ భామ ఎవరు? ఇప్పుడు నెట్టింట్లో ఇదే చర్చ జోరందుకుంది. మరి ఈ బ్యూటీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 22, 2026, 13:24:15 IST
Advertisement

Who Is Kruthika: కృతిక ఉమాశంకర్.. ఇలా చెప్తే ఎక్కువ మందికి ఈ పేరు తెలియదు కావొచ్చు. కానీ పొదరిల్లలోని మహాలక్ష్మి అండి అంటే మాత్రం.. ఓ ఈ అమ్మాయే కదా అని ఠక్కున గుర్తు పట్టేస్తారు. అవును.. పొదరిల్లు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంటున్న కన్నడ భామనే కృతిక ఉమాశంకర్. ఇప్పుడు కూకు విత్ జాతిరత్నాలు షోలోనూ అదరగొడుతోంది.

బెంగళూరు టూ హైదరాబాద్

బుల్లితెర బ్యూటీ.. అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఈ కృతిక‌ ఎవరు? కుర్రాళ్ల కలల రాణిగా భామ.. రెమ్యునరేషన్? (instagram-KRUTHIKA UMASHANKAR)
బుల్లితెర బ్యూటీ.. అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఈ కృతిక‌ ఎవరు? కుర్రాళ్ల కలల రాణిగా భామ.. రెమ్యునరేషన్? (instagram-KRUTHIKA UMASHANKAR)

కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన కృతిక ఉమాశంకర్.. స్టూడెంట్ లైఫ్ నుంచే మోడలింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌పై ఆసక్తి చూపింది. కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత, స్టార్ మా ప్రసారం చేసిన ‘మగువ ఓ మగువా’ సీరియల్‌లో ‘సింధూర’ పాత్రతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది.

ఆ సీరియల్ రన్ అవుతుండగానే.. ప్రముఖ నటుడు నిరుపమ్ పరిటాల (కార్తీక దీపం డాక్టర్ బాబు) నిర్మించిన ‘పొదరిల్లు’ సీరియల్‌లో లీడ్ రోల్ ‘మహాలక్ష్మి’గా ఛాన్స్ కొట్టేసింది.

ఫ్యామిలీలో ఇష్టం లేకపోయినా

కృతిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె కుటుంబంలో తల్లికి తప్ప మిగిలిన ఎవరికీ ఆమె యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావడం ఇష్టం లేదట. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చి తనను తాను నిరూపించుకుంది. 'పొదరిల్లు'లో తన కో-స్టార్ చక్రి (దీపక్)తో కలిసి కృతిక చేసే ఇన్ స్టాగ్రామ్ రీల్స్, బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుండటం విశేషం.

అభిమానుల ప్రేమ

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కృతిక మాట్లాడుతూ.. "తెలుగు ప్రేక్షకులు నాపై చూపుతున్న అభిమానం చూస్తుంటే మాటలు రావడం లేదు. ఇప్పుడు బయటకు లేదా గుడికి ప్రశాంతంగా వెళ్లలేకపోతున్నాను.. అందరూ నన్ను 'మహాలక్ష్మి' అని గుర్తుపట్టి ప్రేమగా పలకరిస్తున్నారు" అని సంతోషం పట్టలేకపోయింది.

రెమ్యునరేషన్

కృతిక రెమ్యునరేషన్ పరంగానూ బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్క రోజుకు రూ.20 వేల వరకూ అందుకుంటుందని తెలిసింది. అటు సీరియల్, ఇటు షోతో కృతిక క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.

టాలీవుడ్ క్రష్ ఎవరు?

ఇంటర్వ్యూలలో తన పర్సనల్ ఇష్టాయిష్టాల గురించి పంచుకుంటూ.. టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అని చెప్పింది కృతిక. ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమా తనకు ఎంతో ఇష్టమని, సూపర్‌స్టార్ మహేష్ బాబుచ ప్రభాస్‌లు తన టాలీవుడ్ క్రష్‌లు అని బయటపెట్టింది. ఇక హీరోయిన్లలో అనుష్క, త్రిష, సౌందర్య, శ్రీదేవిల యాక్టింగ్‌ను ఆరాధిస్తానని తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe