...
...
Next Story

Podarillu November 6 Episode: పొదరిల్లు.. మాధవ, మనీషా పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన బన్సీ.. మహా హగ్ కోసం చక్రి తహతహ

Podarillu Serial November 6th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్ లో మనీషా నుంచి టిట్లా మనుషుల నుంచి మాధవ కాపాడతాడు. వాళ్ల పెళ్లి చేద్దామని మహా అంటే.. బన్సీ మరో ట్విస్ట్ ఇస్తాడు. అటు చక్రి కష్టాలు మరింత ఎక్కువవుతాయి.

Published on: Nov 6, 2026, 07:48:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో టిట్లా మనుషుల చేతుల్లో మాధవ గాయపడతాడు. ఇంటికి వచ్చిన వాళ్లను చూసి మహా, చక్రి షాకవుతారు. ఈ సమస్యకు పరిష్కారం వాళ్ల పెళ్లే అని మహా అంటే.. బన్సీ మాత్రం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.

లాంగ్ డ్రైవ్ వెళ్దామన్న శైలు.. బైకు లేదన్న కేశవ.. ప్లాన్ ఫెయిల్

పొదరిల్లు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్

కేశవ దగ్గరికి వచ్చి లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని శైలు అడిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 6) ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గర బైకు లేదని, అన్నయ్య తీసుకెళ్లాడని కేశవ చెబుతాడు. ఎందుకు అని అడిగితే.. మనీషాతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లాడని చెప్పడంతో శైలు షాకవుతుంది. నిన్నగాక మొన్న ప్రేమించుకోవడం మొదలు పెట్టిన వాళ్లు లాంగ్ డ్రైవ్ లకు వెళ్తున్నారు కానీ.. నువ్వు మాత్రం నన్ను తీసుకెళ్లడం లేదంటూ కేశవను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది.

సరే ఆ బైకు లేకపోతే ఏంటి.. కస్టమర్ బైకు మీద వెళ్దాం అని కేశవ అనడంతో కూలవుతుంది. తాను మాధవ, మనీషా వెళ్లడం చూశానని, నువ్వు ఏం చెబుతావో తెలుసుకుందామని అనుకున్నానని అంటుంది. ఇద్దరూ లాంగ్ డ్రైవ్ కు ప్లాన్ చేసే సమయానికి కస్టమర్ వచ్చి బైకు తీసుకెళ్లడంతో ప్లాన్ ఫెయిలవుతుంది.

మనీషా కోసం టిట్లా రౌడీల వేట

మరోవైపు మనీషా కోసం ఆమె బావ టిట్లా మనుషులు వేట మొదలుపెడతారు. ఫోన్ లో ఆమె ఫొటో చూపిస్తూ.. అందరినీ అడుగుతుంటారు. చివరికి ఓ వ్యక్తి ఆమెను తాను చెరువు గట్టుపై చూశానని చెప్పడంతో వాళ్లు అక్కడికి వెళ్తారు. అప్పటికే అక్కడ మాధవ, మనీషా రొమాన్స్ లో ఉంటారు.

మనీషా మాధవను గట్టిగా పిలుస్తుంది. దూరం నుంచి ఆమెను లాక్కెళ్లడం చూసిన మాధవ పరుగెత్తుకుంటూ వస్తాడు. రౌడీలను ఎదిరిస్తాడు. దీంతో వాళ్లు అతనితో గొడవ పడతారు. వాళ్లను మాధవ చితకబాదుతాడు. ఇంతలో ఒకడు కత్తి తీసుకొని మాధవపై దాడి చేస్తాడు.

దీంతో అతని చేతికి గాయమవుతుంది. అయినా కూడా మాధవ వెనక్కి తగ్గడు. ముగ్గురు రౌడీలను చితకబాదుతాడు. దీంతో వాళ్లు భయంతో అక్కడి నుంచి పారిపోతారు. మనీషా ఏడుస్తూ ఉంటుంది. ఆమెను తీసుకొని మాధవ ఇంటికి బయలుదేరుతాడు.

చక్రితో ఆడుకున్న మహా.. చివరికి కనికరించి..

ఇటు ఇంట్లో చక్రితో మహా ఆడుకుంటూనే ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న చక్రి.. అన్న మాధవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతని ఆకలి బాధ చూసి మహా, కన్నా నవ్వుకుంటూ ఉంటారు. మాధవ బయట కష్టపడి వస్తాడు.. మళ్లీ వంటి చేయిస్తావా.. నీకు ఆకలిగా ఉంటే నువ్వే వండుకోవచ్చు కదా.. ఎలుగుబంటిలా ఉన్నావ్ అని తిడుతుంది.

ఎలా చేయాలో మీరు చెబుతారా అని చక్రి అడుగుతాడు. చక్రిని తీసుకొని మహా, కన్నా, కేశవ కిచెన్ లోకి వెళ్తారు. చికెన్ ఫ్రై చేస్తానని చక్రి అంటే.. చికెన్ లేకుండా చికెన్ ఫ్రై చేస్తావా అని మహా అంటుంది. మధ్యమధ్యలో 50 పర్సెంట్ పేరు చెప్పి ఏడిపిస్తూనే ఉంటుంది. చివరికి తాను ఆర్డర్ పెట్టానని, త్వరలోనే వస్తుందని అనడంతో చక్రి హమ్మయ్య అనుకుంటాడు.

మాధవ, మనీషాను చూసి ఇంట్లో వాళ్లు షాక్.. టిట్లా పేరు చెప్పడంతో ఆందోళన

అప్పుడే మాధవ కోసం బన్సీ వస్తాడు. మనీషా ఇంకా రాలేదని అడుగుతాడు. అప్పుడే మాధవ, మనీషా కూడా వస్తారు. మనీషా ఏడుస్తూ ఉండటం చూసి ఇంట్లో వాళ్లు షాకవుతారు. మాధవ చేతికి గాయమవడం కన్నా చూస్తాడు. ఏం జరిగిందని అడుగుతారు. రౌడీలు వెంట పడ్డారని, అప్పటి నుంచి మనీషా భయంతో వణికిపోతుందని మాధవ చెబుతాడు.

వాళ్లు తనకు తెలుసు అని, టిట్లా మనుషులు అని, తనను ఊరికి బలవంతంగా తీసుకెళ్లడానికి వచ్చారని మనీషా ఏడుస్తూ చెబుతుంది. మాధవ లేకపోతే ఇవాళ వాళ్లు తీసుకెళ్లిపోయేవాళ్లని అనడంతో అతనికి బన్సీ థ్యాంక్స్ చెబుతాడు. ఇలా వాళ్లకు భయపడుతూ ఇంకెన్నాళ్లు.. ఏదో ఒకటి చేయాలి కదా అని చక్రి అంటాడు.

పెళ్లి చేసేద్దామన్న మహా.. ట్విస్ట్ ఇచ్చిన బన్సీ

వెంటనే మాధవ, మనీషా పెళ్లి చేసేద్దాం.. వాళ్లకు ఇష్టం.. మాకూ ఇష్టం.. మీకు కూడా ఇష్టమే కదా అని బన్సీతో మహా అంటుంది. కానీ ఇక్కడే బన్సీ ట్విస్ట్ ఇస్తాడు. తన తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటాడు. టిట్లా దగ్గర బాగా డబ్బు ఉండటంతో మనీషాను అతనికే ఇచ్చి చేద్దామంటున్నారని, మాధవతో పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెబుతాడు. దీంతో అందరూ ఆలోచనలో పడతారు.

పబ్లిగ్గా కేశవ, శైలు రొమాన్స్.. చక్రి క్లాస్

ఇంట్లో బండి స్టార్ట్ కాకపోవడంతో చక్రి కిందామీదా పడి తోసుకుంటూ కేశవ షాపుకు తీసుకెళ్తాడు. అప్పటికే అక్కడ శైలుతో అతడు రొమాన్స్ లో ఉంటాడు. ఆమెకు ముద్దు పెట్టబోతుంటే చక్రి చూసి గట్టిగా అరుస్తాడు. దీంతో వాళ్లు దూరంగా జరుగుతారు. అప్పటికే మాధవకు మనీషా ముద్దు ఇవ్వడం చూసిన చక్రి.. తనకు హగ్ కే దిక్కులేదు.. వీళ్లు ముద్దుల వరకూ వెళ్లిపోయారు అని బాధపడతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks