పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత అతని మార్కెట్ స్థాయి ఆకాశన్నంటింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రభాస్ కెరీర్ కాస్త ఒడిదుడుకులతో సాగుతోంది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడితే, మరికొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా విడుదలైన హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ ప్రభాస్ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడంలో వెనుకబడిందనే చెప్పాలి.
ప్రభాస్ టాప్ 7 సినిమాలు

ది రాజా సాబ్ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో తొలి రోజు రూ.45 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. అసలు ప్రభాస్ గత సినిమాలు తొలి రోజు ఎంత రాబట్టాయి? వాటితో పోలిస్తే ‘రాజా సాబ్’ ఎక్కడ నిలిచిందో ఒకసారి చూద్దాం.
బాహుబలి 2 (2017)
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దశ, దిశను మలుపు తిప్పిన సినిమా ఇది. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ఒక్క ప్రశ్న దేశం మొత్తాన్ని థియేటర్లకు రప్పించింది. రాజమౌళి అద్భుత సృష్టి అయిన ఈ మూవీ.. తొలిరోజు ఇండియాలో ఏకంగా రూ. 121 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ప్రభాస్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్.
కల్కి 2898 AD (2024)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అద్భుత విజయం సాధించింది. కంటెంట్ పరంగా, వసూళ్ల పరంగా బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ చూపిన సినిమా ఇదే. ఇది తొలిరోజు రూ. 95 కోట్ల ఓపెనింగ్స్‌తో దుమ్మురేపింది.
సలార్ (2023)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన మాస్ విశ్వరూపాన్ని చూపించాడు. యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పించిన ఈ చిత్రం.. తొలిరోజు రూ. 90 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.
సాహో (2019)
{{/usCountry}}ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ తన మాస్ విశ్వరూపాన్ని చూపించాడు. యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పించిన ఈ చిత్రం.. తొలిరోజు రూ. 90 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.
సాహో (2019)
{{/usCountry}}బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘సాహో’పై ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. నెగిటివ్ టాక్‌లోనూ తొలిరోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ఆదిపురుష్ (2023)
ప్రభాస్ కెరీర్‌లో అత్యంత వివాదాస్పద చిత్రంగా, ట్రోల్స్ బారిన పడిన సినిమాగా ‘ఆదిపురుష్’ నిలిచింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్స్, పాత్రల తీరుపై విమర్శలు వచ్చాయి. అయినా సరే, ప్రభాస్ క్రేజ్ వల్ల తొలిరోజు రూ. 86 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
ది రాజా సాబ్ (2026)
ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్‌లో, హారర్ కామెడీ జానర్‌లో చూడటం ఫ్యాన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. కానీ బాక్సాఫీస్ నంబర్స్ మాత్రం ప్రభాస్ స్థాయికి తక్కువే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ హవా నడుస్తుండటం కూడా దీనికి ఒక కారణం. ఈ సినిమా తొలిరోజు రూ. 45 కోట్లతో సరిపెట్టుకుంది. ఇది రాధేశ్యామ్ కంటే ఎక్కువైనా.. సలార్, కల్కి, సాహోల కంటే చాలా తక్కువ.
రాధేశ్యామ్ (2022)
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం, కెమిస్ట్రీ పండకపోవడంతో కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఈ సినిమా తొలిరోజు కేవలం రూ. 43 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రస్తుత ‘రాజా సాబ్’ వసూళ్లు దీని కంటే మెరుగ్గా ఉన్నాయి.