ఈ వారం ఓటీటీలోని స్పెషల్ తెలుగు సినిమాలు-బాహుబలి ఎపిక్ నుంచి ఆంధ్ర కింగ్ తాలూాకా వరకు-వీకెండ్ కు బెస్ట్-ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీలోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయి. బాహుబలి ది ఎపిక్ నుంచి ఆంధ్ర కింగ్ తాలూకా వరకూ డిఫరెంట్ జోనర్ సినిమాలున్నాయి. వీకెండ్ కు ఇవి బెస్ట్.

Published on: Dec 27, 2025, 19:21:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి వారం ఓటీటీలో కొత్త సందడి ఉంటుంది. ఇందులో తెలుగు సినిమాల వాటా కూడా ఎక్కువే. వివిధ జానర్లలో సినిమాలు తెలుగు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వస్తాయి. ఈ వారం కూడా చాలా తెలుగు మూవీస్ వచ్చాయి. ఇందులో స్పెషల్ గా ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ

ఈ వారం ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఇది డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఓ సినిమా హీరో అభిమాని చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. తన అభిమాన హీరో వందో సినిమా కంప్లీట్ చేయడానికి రూ.3 కోట్లు అవసరమవుతాయి. ఫ్యాన్ ఆ సాయం చేస్తాడు.

రివాల్వర్ రీటా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా. ఇది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అనే మెసేజ్ అందిస్తుంది. ఓ గ్యాంగ్ స్టర్ ను సినిమాలో కీర్తి సురేష్ తల్లి చంపేస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రివాల్వర్ రీటా సినిమాలో కీర్తి సురేష్, రాధికా శరత్ కుమార్, సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

11:11

ఓటీటీలోకి ఈ వారం వచ్చిన మరో తెలుగు సినిమా 11:11. ఇదో మిస్టరీ మర్డర్ థ్రిల్లర్. ఇందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ 2021లో స్టార్ట్ అయింది. కానీ వివిధ కారణాల వల్ల రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. చివరకు ఆహా వీడియో ఓటీటీలోకి ఈ వారం నేరుగా రిలీజైంది. ఈ చిత్రంలో ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి హత్యకు గురవుతాడు.

బాహుబలి ది ఎపిక్

బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసింది. బాహుబలి 1, బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనంగా మారాయో తెలిసింది. ఈ రెండు సినిమాలను కలిపి, రీ మాస్టర్డ్ వర్షన్ గా బాహుబలి ది ఎపిక్ ను థియేటర్లో రిలీజ్ చేశారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రలు పోషించారు. ఈ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More