ఇవాళ ఓటీటీలోకి వచ్చిన కీర్తి సురేస్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్-అనుకోకుండా గ్యాంగ్‌స్ట‌ర్ మ‌ర్డ‌ర్‌-క‌ర్మ వ‌ద‌ల‌దంటూ!

ఇవాళ ఓటీటీలోకి కీర్తి సురేష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. కర్మ ఎప్పటికీ, ఎవరినీ వదిలి పెట్టదనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ఇది మరి ఈ గ్యాంగ్ స్టర్ మర్డర్ కేసు చుట్టూ తిరిగే సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి. 

Published on: Dec 26, 2025, 09:26:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. కర్మ సిద్ధాంతం కాన్సెప్ట్ తో, గ్యాంగ్ స్టర్ మర్డర్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సినిమానే రివాల్వర్ రీటా.

కీర్తి సురేష్
కీర్తి సురేష్

రివాల్వర్ రీటా ఓటీటీ

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రివాల్వర్ రీటా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ గా తమిళంలో తెరకెక్కిన ఈ రివాల్వర్ రీటా సినిమా ఓటీటీలో తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో విడుదలై కొద్ది వారాలకే ఓటీటీలోకి వస్తున్న అతి కొద్ది కొత్త తమిళ సినిమాలలో ఇది ఒకటి.

థియేటర్ రెస్పాన్స్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రివాల్వర్ రీటా నవంబర్ 28న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. స్టోరీ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టిందనే కామెంట్లు వినిపించాయి. ఈ సినిమాకు జేకే చంద్రు డైరెక్టర్. ఈ సినిమాలో కీర్తి సురేష్, రాధిక శరత్ కుమార్, సునీల్, సెండ్రయాన్ తదితరులు నటించారు.

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం రివాల్వర్ రీటా బాక్సాఫీస్ వద్ద రూ. 4.76 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీని నెట్ వసూళ్లు రూ. 3.99 కోట్లుగా ఉన్నాయి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎప్పటికైనా మూల్యం చెల్లించాల్సిందేనన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

రివాల్వర్ రీటా కథ

రీటా (కీర్తి సురేష్), ఆమె తల్లి (రాధికా శరత్ కుమార్) ఓ ఇంట్లో ఉంటారు. మరోవైపు పాండిచ్చేరిలో క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్). డ్రాకులా చేతిలో నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) బ్రదర్ హత్యకు గురవుతాడు. దీంతో డ్రాకులాను చంపాలని ఓ గ్యాంగ్ కు రూ.5 కోట్లతో డీల్ సెట్ చేస్తాడు నర్సింహారెడ్డి.

కానీ ఓ రోజు డ్రాకులా పాండ్యన్ డ్రగ్స్ మత్తులో పొరపాటున వేరే ఇంటికి వెళ్లబోయి రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రీటా తల్లి కొట్టడంతో పాండ్యన్ చనిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? డ్రాకులా కొడుకు బాబీ పాండ్యన్ (సునీల్) తన తండ్రిని చంపిన వాళ్లను కనిపెట్టాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More