Prabhas Fauzi Glimpse Released On His Birthday: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) వేడుకల వేళ ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే కానుక అందించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్ / #Prabhas25) నుంచి మేకర్స్ తాజాగా రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు.
నేతాజీతో ఎలివేషన్

సుమారు 2 నిమిషాల 31 సెకన్లపాటు సాగిన ఈ స్పెషల్ వీడియోలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇప్పించడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వరల్డ్ వార్ 2 సమయంలో 1942 సంవత్సరం మే 29న జెర్మనీలోని బెర్లిన్‌లో హిట్లర్‌ను సుభాష్ చంద్రబోస్ కలుస్తారు.
"మనకున్న ఏకైక శత్రువు బ్రిటన్. ఆ బ్రిటన్‌ను ఓడించడానికి మా దగ్గర ఓ మనిషి ఉన్నాడు. అతనికి పేరు లేదు. కానీ, అతన్ని అంతా ఫౌజీ అని పిలుస్తారు. ప్రస్తుతం నా దేశాన్ని కాపాడే బాధ్యతలో కలకత్తాలో ఉన్నాడు" అని ప్రభాస్ గురించి నేతాజీ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
రెండు వైపులా ప్రభాస్
ఆ తర్వాత "ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్" అంటూ ప్రభాస్ చేతులతో రక్తం చిందించే సీన్ నెక్ట్స్ లెవెల్ ఉంది. అనంతరం "1932 నుంచి మోస్ట్ వాంటెడ్" అంటూ భారీ రైఫిల్‌ను తిప్పే ప్రభాస్‌ను చూపించడం, అప్పుడు వచ్చే బీజీఎమ్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి.
అరే వో ఫిరంగీ.. (బ్రిటీషర్) నా దేశం కోసం నీ రక్తాన్ని చీలుస్తా" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. హిట్లర్, నేతాజీ సంభాషణలో వచ్చే భగవద్గీత లైన్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక వీడియో ఎండింగ్‌లో ప్రభాస్‌ను రెండు వైపులా చూపిస్తూ హ్యాపీ బర్త్ డే చెప్పిన తీరు నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
ఇలా మొత్తంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి వచ్చిన ఈ వీడియో డార్లింగ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
{{/usCountry}}ఇలా మొత్తంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి వచ్చిన ఈ వీడియో డార్లింగ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
{{/usCountry}}ఆకట్టుకుంటున్న వింటేజ్ నాణెం, కమాండింగ్ లుక్
ఇకపోతే ఈ వీడియోకు ముందు ఇవాళ విడుదల చేసిన పోస్టర్‌లో ఒక పాతకాలపు బంగారు నాణెంపై యూనిఫాంలో ఉన్న ప్రభాస్ సైడ్ ప్రొఫైల్ కనిపించింది. చుట్టూ మంటల వెలుగులు, నాణెంపై ప్రభాస్ రోల్ గంభీరంగా చూపించారు.
"డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్: #025.. 'ఎవరా వ్యక్తి?' అనే ప్రశ్నకు త్వరలోనే వీడియో రూపంలో సమాధానం ఇస్తాం" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 'ఒంటరిగా పోరాడే ఒక సైన్యం' (A Battalion Who Fights Alone) అనే క్యాప్షన్ ఇవ్వడం, తాజాగా వీడియో రిలీజ్ చేసి ఫౌజీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
1940ల కాలంనాటి చారిత్రక కథాంశంతో..
'సీతారామం' వంటి క్లాసిక్ అందించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం, అంటే 1940ల కాలంనాటి చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో ప్రభాస్ ఒక వీరోచిత సైనిక అధికారి పాత్రలో కనిపిస్తారని అర్థమైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.