Prabhas Net Worth On His Birthday: ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 47వ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా అభిమానులు, చిత్ర ప్రముఖులు శుభాకాంక్షల వర్షం కురిపించారు.
వెయ్యి కోట్ల కలెక్షన్స్ రెండు సార్లు

ఛత్రపతి, బిల్లా, మిర్చి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ప్రభాస్ ఆయన, 'బాహుబలి' సిరీస్‌తో భారతీయ సినిమా సరిహద్దులను తిరగరాశారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన రెండు పాన్ ఇండియా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
సినిమాకు రూ. 150 కోట్లు.. బాక్సాఫీస్ రికార్డులు
ప్రస్తుతం ఇండియన్ చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే, 'ది రాజా సాబ్' చిత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పారితోషికాన్ని రూ. 100 కోట్లకు తగ్గించుకున్నారని వినోద రంగానికి చెందిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఫోర్బ్స్ ఇండియా లెక్కల ప్రకారం ప్రభాస్ మొత్తం నికర ఆస్తి విలువ సుమారు రూ. 241 నుంచి రూ. 450 కోట్లుగా ఉంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఆరు చిత్రాలు ఉన్న ఏకైక భారతీయ నటుడు కూడా ప్రభాసే. నటనతో పాటు 'యూవీ క్రియేషన్స్' నిర్మాణ సంస్థతోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంది.
హైదరాబాద్ నుంచి ఇటలీ వరకు కోట్లాది విల్లాలు
హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రభాస్‌కు ఒక లగ్జరీ విల్లా ఉంది. ఈ భవనం విలువ సుమారు రూ. 60 కోట్లు. ఇందులో సొంత జిమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెన్ ఉన్నాయి.
{{/usCountry}}హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రభాస్‌కు ఒక లగ్జరీ విల్లా ఉంది. ఈ భవనం విలువ సుమారు రూ. 60 కోట్లు. ఇందులో సొంత జిమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెన్ ఉన్నాయి.
{{/usCountry}}స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ భీమవరంలో ఫామ్‌హౌస్‌తో పాటు ముంబైలో రూ. 10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కూడా ఉందంటున్నారు. వీటితో పాటు ఇటలీ ప్రశాంత వాతావరణంలో ఒక హిల్-వ్యూ విల్లా కూడా ప్రభాస్ సొంతమని సినీ వర్గాల సమాచారం.
గ్యారేజీలో గర్జించే లగ్జరీ కార్ల సైన్యం
ప్రభాస్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఆయన వద్ద ఉన్న ప్రముఖ కార్ల వివరాలు:
రూ. 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్
రూ. 6 కోట్ల విలువైన లంబోర్గిని అవెంటాడోర్ ఎస్ రోడ్‌స్టర్
రూ. 2 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్
రూ. 1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్
రూ. 1 కోటి విలువైన జాగ్వార్ ఎక్స్‌జెఎల్
రూ. 60 లక్షల విలువైన ఆడి ఏ6
వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీ
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫౌజీ', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న 'కల్కి 2898 ఏడీ: పార్ట్ 2', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' సినిమాలతో ప్రభాస్ పూర్తి బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.