శర్వానంద్ అప్ కమింగ్ మూవీ ‘బైకర్’. ఇది బైక్ రేసింగ్ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమా. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా థియేటర్లకు రాబోతున్న బైకర్ చిత్రం ట్రైలర్ ను ఆదివారం (మార్చి 22) రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సపోర్ట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది.
ప్రభాస్ సపోర్ట్

శర్వానంద్ హిరోగా నటించిన బైకర్ మూవీకి ప్రభాస్ సపోర్ట్ గా నిలిచారు. బైకర్ ట్రైలర్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ప్రభాస్ షేర్ చేశాడు. ‘‘ట్రైలర్ వైబ్ నాకెంతో నచ్చింది. చాలా ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. శర్వానంద్ కు, యూవీ క్రియేషన్స్ కు, మొత్తం బైకర్ టీమ్ కు బెస్ట్ విషెస్. ఏప్రిల్ 3న బిగ్ సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా’’ అని ప్రభాస్ పోస్టు చేశాడు.
శర్వా థ్యాంక్స్
బైకర్ ట్రైలర్ పోస్టు చేసి, సపోర్ట్ చేసిన ప్రభాస్ కు శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. ‘‘చాలా థ్యాంక్స్ ప్రభాస్ అన్న. మాకు ఇదెంతో ముఖ్యమైంది. ఇప్పుడు మేం మరింత ఛార్జ్ అయ్యాం. డాల్సీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ లో ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ను ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళంలో బైకర్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది’’ అని శర్వానంద్ పోస్టు చేశాడు.
డార్లింగ్ అంటే అంతే
{{/usCountry}}బైకర్ ట్రైలర్ పోస్టు చేసి, సపోర్ట్ చేసిన ప్రభాస్ కు శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. ‘‘చాలా థ్యాంక్స్ ప్రభాస్ అన్న. మాకు ఇదెంతో ముఖ్యమైంది. ఇప్పుడు మేం మరింత ఛార్జ్ అయ్యాం. డాల్సీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ లో ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ను ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళంలో బైకర్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది’’ అని శర్వానంద్ పోస్టు చేశాడు.
డార్లింగ్ అంటే అంతే
{{/usCountry}}బైకర్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్ చేయడంతో అతని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘తన సినిమా తప్ప అందరి సినిమాలు ప్రమోట్ చేస్తాడు.. మా డార్లింగ్ బంగారం’’ అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ‘‘రాజు గారు తన సినిమా అప్ డేట్స్ కంటే కూడా వేరేవాళ్ల అప్ డేట్స్ ఇస్తాడు’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
బైకర్ గురించి
శర్వానంద్ హీరోగా నటించిన రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బైకర్’. ఈ మూవీ ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. శర్వానంద్ కు తండ్రిగా, మెంటార్ గా నటించాడు.
నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి 2026కు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శర్వానంద్, ఇప్పుడు బైకర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నానని ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చెప్పాడు.