సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలోకి వచ్చిన ది రాజా సాబ్ కు షాక్ తగిలింది. సోమవారం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియాలో కేవలం రూ.5.4 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మూవీ రిలీజయ్యాక నాలుగో రోజు పరిస్థితి ఇలా ఉండటం ఫ్యాన్స్ కు మింగుడుపడనిదే. మరి మూవీ బడ్జెట్ ఎంత? రాజా సాబ్ హిట్ అవుతుందా?
రాజా సాబ్ కలెక్షన్లు

ఈ ఏడాది ప్రభాస్ నటించిన భారీ చిత్రం రాజా సాబ్. ఈ హారర్-కామెడీ థ్రిల్లర్ గత శుక్రవారం (జనవరి 9) విడుదలైంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, పెద్ద ఓపెనింగ్ మాత్రం సాధించింది. అయితే, ఆ ఊపును కొనసాగించలేకపోయింది. దురదృష్టవశాత్తు గత కొన్ని రోజులుగా వసూళ్లలో క్షీణత కనిపిస్తోంది.
సోమవారం వసూళ్లు
రాజా సాబ్ కలెక్షన్లు నాలుగో రోజైన సోమవారం (జనవరి 12) దారుణంగా పడిపోయాయి. సక్నిల్క్ ప్రకారం రాజా సాబ్ నాలుగో రోజు ఇండియాలో రూ.5.4 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. ఇది సినిమా చరిత్రలో అతి తక్కువ సింగిల్-డే కలెక్షన్. మునుపటి రోజుల కంటే చాలా తక్కువ. మొదటి రోజు అత్యధికంగా రూ.53.75 కోట్లు సాధించిన రాజా సాబ్.. శనివారం రూ.26 కోట్లకు పడిపోయింది. ఆదివారం ఇది మరింత ఆందోళనకరంగా రూ.19.1 కోట్లుగా నమోదైంది.
మొత్తం ఎంతంటే?
సోమవారం వసూళ్లు కలుపుకొంటే రాజా సాబ్ మూవీకి నాలుగు రోజుల్లో ఇండియాలో మొత్తం రూ.113.4 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. చాలా మంది విమర్శకులు బలహీనమైన స్క్రీన్‌ప్లేను విమర్శించారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటించారు.
రాజా సాబ్ బడ్జెట్
రాజా సాబ్ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పటికే రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అవి కాకుండా మిగతా సంక్రాంతి సినిమాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ హిట్ గా నిలుస్తుందా? లేదా? అనేది సందేహంగా మారింది.
ఆన్ లైన్ లీక్
{{/usCountry}}రాజా సాబ్ బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పటికే రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అవి కాకుండా మిగతా సంక్రాంతి సినిమాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ హిట్ గా నిలుస్తుందా? లేదా? అనేది సందేహంగా మారింది.
ఆన్ లైన్ లీక్
{{/usCountry}}విడుదలైన ఒక రోజు తర్వాత రాజా సాబ్ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది మూవీ కలెక్షన్లను దెబ్బకొట్టేదే. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పైరేట్ ప్లాట్‌ఫారమ్‌లపై చర్యలు తీసుకున్నారు.