ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 అదరగొడుతోంది. ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీ చూశాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి అల్లు సినిమాస్ లో సినిమా వీక్షించాడు.
సందీప్ తో ప్రభాస్

సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 చూడటం వైరల్ గా మారింది. వీళ్లకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మూడు గంటలకు
అల్లు సినిమాస్ లోకి ప్రభాస్ వెళ్లడం, మూవీ చూడటం, అక్కడి నుంచి బయటకు రావడం.. ఇలా వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అల్లు సినిమాస్ కు వచ్చాడనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉన్నారు. ప్రభాస్ ను చూసేందుకు గేటు బయట వేచి చూశారు.
స్పిరిట్ గురించి
ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి చేస్తోంది. ఈ సినిమాను మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు.
ప్రభాస్ జోరు
{{/usCountry}}ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి చేస్తోంది. ఈ సినిమాను మార్చి 5, 2027న రిలీజ్ చేయనున్నారు.
ప్రభాస్ జోరు
{{/usCountry}}2026 సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ మూవీతో థియేటర్లకు వచ్చాడు ప్రభాస్. కానీ ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే మరో మూవీ రిలీజ్ చేసేందుకు ప్రభాస్ ప్లాన్స్ చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న ఫౌజీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
అప్పుడే రిలీజ్
హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను 2026 డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది కాకుండా ప్రభాస్ లైనప్ లో సలార్ 2 కూడా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ టైమ్ సెట్ చేసుకుని మరీ ధురంధర్ 2 చూడటం విశేషం.