...
...
Next Story

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడికి ప్రభాస్ ఫుల్ సపోర్ట్.. శ్రీనివాస మంగాపురం మూవీపై రెబల్ స్టార్ పోస్ట్ వైరల్

Srinivasa Mangapuram: ఘట్టమనేని వంశం నుంచి వస్తున్న మరో వారసుడు జయకృష్ణకు రెబల్ స్టార్ ప్రభాస్ అండగా నిలిచారు. అతడు నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ రిలీజ్ కు ముందు టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

Published on: Jul 29, 2026, 13:49:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Srinivasa Mangapuram: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లవ్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’ రేపే అంటే జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణకి, రషా తడానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అందించారు. పెద్ద సినిమా రిలీజ్ ముందు ప్రభాస్ నుంచి ఇలాంటి బూస్ట్ రావడంతో ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

"బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి".. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడికి ప్రభాస్ ఫుల్ సపోర్ట్.. శ్రీనివాస మంగాపురం మూవీపై రెబల్ స్టార్ పోస్ట్ వైరల్
Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడికి ప్రభాస్ ఫుల్ సపోర్ట్.. శ్రీనివాస మంగాపురం మూవీపై రెబల్ స్టార్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' (Spirit) షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో 'శ్రీనివాస మంగాపురం' పోస్టర్ షేర్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని వెండితెర అరంగేట్రంపై ప్రభాస్ స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే 'ఉయి అమ్మ' ప్రైవేట్ సాంగ్‌తో ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ రషా తడాని (రవీనా టాండన్ కూతురు) టాలీవుడ్ డెబ్యూకి శుభాకాంక్షలు తెలిపారు. మూవీ ప్రెజెంటర్ అశ్విని దత్, డైరెక్టర్ అజయ్ భూపతి, ప్రొడ్యూసర్ పి. కిరణ్ టీమ్‌కి బాక్సాఫీస్ దగ్గర బిగ్ సక్సెస్ రావాలని విష్ చేశారు.

ఘట్టమనేని లెగసీ కొనసాగింపు..

సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన సినీ పరంపరను, మహేష్ బాబు నిలబెట్టిన స్టార్‌డమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు జయకృష్ణ సిద్ధమయ్యారు. 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఈ యంగ్ హీరో లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి రా అండ్ రస్టిక్ హిట్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి పాత్రను చాలా ఎమోషనల్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేయడంలో ఆయన మార్క్ ఈ సినిమాలోనూ స్పష్టంగా కనిపించబోతోంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించడం సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా మారింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, బీజీఎం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

రేపే గ్రాండ్ రిలీజ్.. బాక్సాఫీస్ దగ్గర హంగామా!

చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. రేపే థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో జయకృష్ణ ఘట్టమనేని గ్రాండ్ బోణీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఇచ్చిన ఈ స్పెషల్ సపోర్ట్‌తో 'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రమోషన్లకు, అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ ఊపు లభించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe