...
...
Next Story

Prakash Raj: గబ్బర్ సింగ్ ట్యాక్స్‌ వసూలు చేశారు.. ఇప్పుడు త్యాగాలు చేయమంటున్నారు.. ఆయనో పెద్ద ఫెయిల్యూర్: ప్రకాష్ రాజ్

Prakash Raj: నోట్ల రద్దు నుండి ఎంఎస్‌పి వరకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్ చేశారు. దేశాన్ని నడపడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.

Published on: May 11, 2026, 19:13:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఆయన చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'జస్ట్ ఆస్కింగ్' (#justasking) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్న ఆయన.. తాజాగా మోదీ పాలనను 'అట్టర్ ఫ్లాప్' గా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఫల్యాల చిట్టా ఇదీ..

Prakash Raj: గబ్బర్ సింగ్ ట్యాక్స్‌ వసూలు చేశారు.. ఇప్పుడు త్యాగాలు చేయమంటున్నారు.. ఆయనో పెద్ద ఫెయిల్యూర్: ప్రకాష్ రాజ్ (PTI)
Prakash Raj: గబ్బర్ సింగ్ ట్యాక్స్‌ వసూలు చేశారు.. ఇప్పుడు త్యాగాలు చేయమంటున్నారు.. ఆయనో పెద్ద ఫెయిల్యూర్: ప్రకాష్ రాజ్ (PTI)

ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. నోట్ల రద్దు (డెమోనిటైజేషన్) నిర్ణయం వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, పైగా వ్యవస్థను అది నాశనం చేసిందని ఆయన విమర్శించారు.

కరోనా సమయంలో ప్రజలను పళ్ళాలు కొట్టమని, చప్పట్లు కొట్టమని చెప్పిన తీరును ఎద్దేవా చేస్తూ.. "గో కోవిడ్ గో" అంటూ నినాదాలు చేయించడం వెనుక ఉన్న తర్కాన్ని ఆయన ప్రశ్నించారు.

అమలుకాని హామీలపై నిలదీత

ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలను ప్రకాష్ రాజ్ తన ట్వీట్‌లో గుర్తుచేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయల జమ వంటివన్నీ కేవలం 'జుమ్లా' (అబద్ధపు హామీలు) గానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు.

రైతుల కనీస మద్దతు ధర (MSP) విషయంలో అన్నదాతలను ప్రభుత్వం వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. "హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడిని విమానం ఎక్కిస్తానన్న హామీ ఏమైంది?" అని ఆయన ప్రశ్నించారు.

పేదలపై ట్యాక్స్.. ధనికులకు మాఫీ

దేశాన్ని సమర్థవంతంగా నడపడంలో ప్రధాని మోదీ అట్టర్ ఫ్లాప్ అయ్యారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సామాన్య పౌరులను త్యాగాలు చేయమని కోరుతున్నారని ఆయన విమర్శించారు. "ఈ నిజాన్ని జీర్ణించుకోండి" అంటూ ఆయన తన పోస్ట్‌ను ముగించారు.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ.. ప్రజలకు కొన్ని కీలకమైన సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఏడాది వరకు బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు వద్దని, మిడిల్ క్లాస్ వాళ్లు ఆడంబరాలకు దూరంగా ఉండాలని, వంట నూనె వాడకం తగ్గించాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పైనే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు ఆయన విమర్శలను తప్పుబడుతున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రకాష్ రాజ్ ప్రధాని మోదీపై ఎందుకు విమర్శలు చేశారు?

నోట్ల రద్దు, జీఎస్టీ, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలలో ప్రభుత్వం విఫలమైందన్న ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'గబ్బర్ సింగ్ ట్యాక్స్' అంటే ఏమిటి?

వస్తు సేవల పన్ను (GST) ని ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ వాడిన పదాన్ని ఇక్కడ ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు.

ప్రకాష్ రాజ్ తన ట్వీట్‌లో ఏ హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు?

ఆయన ఎప్పటిలాగే తన సిగ్నేచర్ హ్యాష్‌ట్యాగ్ అయిన '#justasking' ను ఉపయోగించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe