Prakash Raj: ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య మరోసారి ట్విటర్ వార్ జోరందుకుంది. పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉన్న ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సిగ్గులేకుండా దిగజారండంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన వీడియో కలకలం రేపుతోంది. దీనికి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు.
ప్రకాష్ రాజ్ వీడియో

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని, జనసేన పార్టీని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ప్రశ్న రావణ్ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇవాళ (జూలై 12) ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వీడియో పోస్టు చేశాడు.
మీ బూతులు వింటున్నా
ప్రకాష్ రాజ్ మరోసారి ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, జన సైనికులను టార్గెట్ చేశాడు. ‘‘నేను మౌనంగా లేదు. అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ల ప్రభావంతో జన సైనికులు, కొందరికి అమ్ముడు పోయిన ఛానెల్‌లు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో ఈ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా’’ అని ప్రకాష్ రాజ్ ఆ వీడియోలో అన్నాడు.
సిగ్గు లేకుండా
‘‘మీ అందరికీ నా సమాధానం ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో, దిగజారే సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి. నాలుగు వైపుల నుంచి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి’’ అని సంచలన కామెంట్లు చేశాడు ప్రకాష్ రాజ్.
జస్ట్ ఆస్కింగ్
‘‘దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా, నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో, కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. చివరిగా మళ్లీ దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి, Just asking’’ అని వీడియో ఎండ్ చేశాడు ప్రకాష్ రాజ్.
{{/usCountry}}‘‘దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా, నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో, కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. చివరిగా మళ్లీ దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి, Just asking’’ అని వీడియో ఎండ్ చేశాడు ప్రకాష్ రాజ్.
{{/usCountry}}బండ్ల గణేష్ కౌంటర్
ప్రకాష్ రాజ్ పోస్టుకు బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చాడు. ‘‘ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్… నీకు స్క్రిప్ట్ ఎవరు ఇస్తే వాళ్లకే అనుగుణంగా డైలాగులు చెబుతావు. అకౌంట్‌లో డబ్బులు పడితే నీ స్టాండ్ కూడా మారిపోతుంది. అందుకే నిన్ను చాలామంది “Any Time Money” అంటున్నారు.
తెలుగు ప్రజలు అమాయకులు కాదు. ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు అజెండాతో మాట్లాడుతున్నారు అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు’’ అని పోస్టులో బండ్ల గణేష్ విరుచుకుపడ్డాడు.
తెలుగు నేర్చుకో
‘‘“మౌనంగా లేదు” కాదు… “మౌనంగా లేను.” ముందు తెలుగు సరిగ్గా నేర్చుకోయ్యా, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్. భాష సరిగ్గా రాకపోయినా, తెలుగు ప్రజలకు పాఠాలు చెప్పడానికి మాత్రం ముందుంటావా? తెలుగు భాషను గౌరవించు… తర్వాత తెలుగు ప్రజలకు నీతులు చెప్పు’’ అని బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశాడు. ‘పైసా కొట్టు.. డైలాగ్ పట్టు’ అంటూ ప్రకాష్ రాజ్ పై మండిపడ్డాడు బండ్ల గణేష్.