...
...
Next Story

Deepika Padukone King: కడుపుతో ఉన్నా షూటింగ్‌లో బిజీ.. ‘కింగ్’తో కలిసి దీపికా పదుకోన్ షూట్.. లీకైన ఫొటోలు వైరల్

Deepika Padukone King: రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించిన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తన తదుపరి మూవీ 'కింగ్' (King) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ షెడ్యూల్ నుంచి షారుఖ్ ఖాన్, దీపికా కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి.

Published on: May 1, 2026, 09:14:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Deepika Padukone King: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఓం శాంతి ఓం' నుంచి 'పఠాన్' వరకు వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా 'కింగ్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతోంది.

లీకైన ఫోటోలలో కెమిస్ట్రీ అదరహో

Deepika Padukone King: కడుపుతో ఉన్నా షూటింగ్‌లో బిజీ.. ‘కింగ్’తో కలిసి దీపికా పదుకోన్ షూట్.. లీకైన ఫొటోలు వైరల్
Deepika Padukone King: కడుపుతో ఉన్నా షూటింగ్‌లో బిజీ.. ‘కింగ్’తో కలిసి దీపికా పదుకోన్ షూట్.. లీకైన ఫొటోలు వైరల్

శుక్రవారం (మే 1) ఉదయం సోషల్ మీడియాలో (ఎక్స్, రెడిట్) ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో దీపికా పదుకోన్ ఫ్లోరల్ ప్రింట్ గౌనులో మెరిసిపోతుండగా, షారుఖ్ ఖాన్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. షారుఖ్.. దీపికా చేయి పట్టుకుని నడుస్తున్న ఈ ఫోటోలు చూస్తుంటే ఇది ఒక ఫ్లాష్‌బ్యాక్ సాంగ్ సీక్వెన్స్ అని అర్థమవుతోంది.

ఈ ఫోటోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "60 ఏళ్ల వయసులో కూడా షారుఖ్ లుక్ అద్భుతంగా ఉంది. జవాన్, పఠాన్ కంటే ఇందులో ఇంకా బెటర్ గా కనిపిస్తున్నారు" అని ఒకరు కామెంట్ చేయగా, "దీపికా ప్రెజెన్స్ సినిమాకు కొత్త కళను తెచ్చింది" అని మరికొందరు రాసుకొచ్చారు.

ప్రెగ్నెన్సీలోనూ తగ్గని దీపికా జోరు

గత ఆదివారం దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు 'దువా' ఫోటోతో తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే గర్భవతి అయినప్పటికీ దీపికా తన సినిమాలకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది.

ఆమెతోపాటు అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

2. కింగ్ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సౌతాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగుతోంది.

3. దీపికా పదుకోన్ రెండోసారి గర్భం దాల్చడం నిజమేనా?

అవును దీపికా తన రెండో ప్రెగ్నెన్సీలో ఉంది. ఆ సమయంలోనే 'కింగ్', 'రాకా' చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe