Premisthe Bharath About OTT And Udayabhanu: తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేసింది. అదే తెలుగు మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పంచనామా'.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 అంటే నేటి నుంచి జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం పంచనామా ఓటీటీ ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
కెరీర్ కాస్తా డౌన్‌లో ఉన్నప్పుడు
ఈ ఈవెంట్‌లో హీరో ప్రేమిస్తే భరత్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో 'జీ5' యాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. నా తమిళ సినిమాలకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా 2019లో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నా మొదటి సినిమా 'కాళిదాస్' విడుదలకు ముందే, నా కెరీర్ కాస్త డౌన్‌లో ఉన్న సమయంలో జీ వాళ్లు ఆ కంటెంట్‌ను నమ్మి తీసుకున్నారు. ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది, అక్కడి నుంచి నా కెరీర్ మళ్లీ ఊపందుకుంది" అని అన్నారు.
నా 24 ఏళ్ల కెరీర్‌లో
"ఇప్పుడు జీ5 తెలుగు టీమ్ 'పంచనామా'ను అనుకున్న విధంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా 24 ఏళ్ల కెరీర్‌లో ఇంత తక్కువ సమయంలో ఇంత స్పష్టతతో, ఎంతో ప్యాషన్‌తో చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఇది" అని ప్రేమిస్తే భరత్ చెప్పారు.
ఉదయభానుపై నమ్మకం కలగలేదు
"నిజం చెప్పాలంటే ఉదయభాను గారు.. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను 22-25 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారోనని నాకు అస్సలు నమ్మకం కలగలేదు. ఇలాంటి జోనర్లో స్క్రీన్‌ప్లే చాలా పక్కాగా ఉండాలి, ప్రేక్షకులకు ఆరు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా బింజ్ వాచ్ చేసేలా ఉండాలి. కానీ సెట్‌కి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు మోహన్ గారి క్లారిటీ చూశాక నా ఆలోచన మారింది" అని హీరో భరత్ పేర్కొన్నారు.
అది ఇద్దరిలో చూశాను
{{/usCountry}}"నిజం చెప్పాలంటే ఉదయభాను గారు.. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌ను 22-25 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారోనని నాకు అస్సలు నమ్మకం కలగలేదు. ఇలాంటి జోనర్లో స్క్రీన్‌ప్లే చాలా పక్కాగా ఉండాలి, ప్రేక్షకులకు ఆరు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా బింజ్ వాచ్ చేసేలా ఉండాలి. కానీ సెట్‌కి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు మోహన్ గారి క్లారిటీ చూశాక నా ఆలోచన మారింది" అని హీరో భరత్ పేర్కొన్నారు.
అది ఇద్దరిలో చూశాను
{{/usCountry}}"యాక్టర్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన దర్శకుడు ఆయన. హీరోయిన్ మేధాకు, తోటి నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్. చేసే పనిపై ప్రేమ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ప్రొడక్షన్ అంటే.. అది నేను భానుజీ, విజయ్ సర్ ఇద్దరిలో చూశాను" అని ప్రేమిస్తే భరత్ వెల్లడించారు.
మొదటి రెండు ఎపిసోడ్స్ చూసిన తర్వాత
"తక్కువ సమయంలో క్వాలిటీ వస్తుందా లేదా అని భాను గారు చాలా టెన్షన్ పడ్డారు. కానీ మొదటి రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత చెబుతున్నాను.. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని అంశాలు, పవర్‌ఫుల్ పాయింట్లు ఇందులో ఉన్నాయి" అని పంచనామా గురించి భరత్ చెప్పారు.
కంటెంట్ ఈజ్ కింగ్
"కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ప్రస్తుతం కంటెంట్ ఈజ్ కింగ్. కొత్త టాలెంట్‌ను ఇలాగే ప్రోత్సహించండి. ఇకపై తెలుగులో మరిన్ని మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా" అని ప్రేమిస్తే భరత్ హామీ ఇచ్చారు.