టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రియదర్శి. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం వంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్ ద్రిషిక చందర్ నటించింది.
ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీరితోపాటు సుయోధన మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన సుయోధన టీజర్ ఇటీవల విడుదల అయింది. దీనికి సంబంధించిన సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సుయోధన, దుర్యోధన అని ఎందుకు
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. "చోటా కె ప్రసాద్ అన్న ఈ కథ నా దగ్గరకు పంపారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది" అని అన్నారు.
నిర్మాత ఒక రైటర్
"ఈ మూవీ ప్రొడ్యూసర్ బోసుబాబు గారు పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీకి రాలేదు. కేవలం తన ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఆయన సుయోధన (నిర్మాత బోసుబాబు నిడిమోలు) ఒక రైటర్. సాంగ్స్ బాగా రాస్తారు. సినిమా మీద ఆయనకున్న ఇష్టం నన్ను బాగా ఇన్స్‌పైర్ చేసింది" అని ప్రియదర్శి తెలిపాడు.
ఏకగ్రీవంగా అనుకున్న పేరు
"ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయి కుమార్ గారు. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది. సాయి కుమార్ గారు తన గొప్ప టాలెంట్‌ను మాలాంటి ముందు జనరేషన్స్‌కు ఇవ్వడం సంతోషంగా ఉంది" అని ప్రియదర్శి పేర్కొన్నాడు.
హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి
{{/usCountry}}"ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయి కుమార్ గారు. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం వారిది. సాయి కుమార్ గారు తన గొప్ప టాలెంట్‌ను మాలాంటి ముందు జనరేషన్స్‌కు ఇవ్వడం సంతోషంగా ఉంది" అని ప్రియదర్శి పేర్కొన్నాడు.
హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి
{{/usCountry}}"డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ద్రిషిక హైదరాబాద్ అమ్మాయి. ఈ మూవీలో చాలా బాగా నటించింది. ఈ నెల 27న సుయోధన మూవీ చూడండి. మీరు బాగా ఎంటర్‌టైన్ అవుతారు" అని తన స్పీచ్ ముగించాడు హీరో ప్రియదర్శి.
సంహిత క్యారెక్టర్‌లో
ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ ద్రిషిక చందర్ మాట్లాడుతూ.. "ఈ సుయోధన చిత్రంలో సంహిత అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్‌లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్" అని చెప్పింది.
మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్
"సాయి కుమార్, ప్రియదర్శి లాంటి మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న థియేటర్స్‌లో మీట్ అవుదాం" అని హీరోయిన్ ద్రిషిక చందర్ వెల్లడించింది.