గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా సుమారు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో ఆమె నటిస్తున్నవిషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ ఈ సినిమా విశేషాలను అంతర్జాతీయ టాక్ షో ‘ది టునైట్ షో’లో పంచుకుంది.
వారణాసి.. మరో ఆరు నెలల షూటింగ్

ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ టాక్ షో 'ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్'లో పాల్గొన్న ఆమె.. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతూ, ఈ సినిమా ఒక అద్భుతమైన అడ్వెంచర్ అని అనడం విశేషం.
చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాలో నటిస్తుండటంపై ప్రియాంక ఎంతో ఉత్సాహంగా ఉంది. షోలో హోస్ట్ జిమ్మీ ఫాలన్‌తో మాట్లాడుతూ.. "నేను ఇండియన్ సినిమా చేసి దాదాపు ఆరు, ఏడేళ్లు అవుతోంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాను. ఆయన భారతదేశపు అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరు. ఈ సినిమా షూటింగ్ ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇప్పటికే 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నాం. ఇది నాకు ఒక గొప్ప అడ్వెంచర్ లాంటిది. మరో ఆరు నెలల షూటింగ్ మిగిలి ఉంది" అని వివరించింది.
మహేష్ బాబు ‘రుద్ర’.. ప్రియాంక ‘మందాకిని’
ఎస్‌ఎస్ రాజమౌళి గతేడాది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటిస్తూ మహేష్ బాబు క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై స్వారీ చేస్తున్న మహేష్ బాబు లుక్ అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
‘ది బ్లఫ్’తో యాక్షన్ మోడ్‌లో ప్రియాంక
{{/usCountry}}ఎస్‌ఎస్ రాజమౌళి గతేడాది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటిస్తూ మహేష్ బాబు క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై స్వారీ చేస్తున్న మహేష్ బాబు లుక్ అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
‘ది బ్లఫ్’తో యాక్షన్ మోడ్‌లో ప్రియాంక
{{/usCountry}}మరోవైపు ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ ఇటీవలే విడుదలైంది. కేమాన్ ఐలాండ్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ప్రియాంక కత్తి సాము, గన్ ఫైట్స్‌తో అదరగొట్టింది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ నటుడు కార్ల్ అర్బన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ మూవీకి చాలా వరకు మిక్స్‌డ్ రివ్యూలే వచ్చాయి.