Priyanka Chopra Supports To We Were Here Short Film: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థ మనుషుల ఉద్యోగాలను మింగేస్తోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న సాంకేతికతపై ఒకవైపు భయాలు, మరోవైపు విశ్లేషణలు నడుస్తున్న వేళ.. ముంబైకి చెందిన యంగ్ డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ ఒక సరదా ఆలోచనను అద్భుతమైన కథనంగా మలిచారు.
అంతర్జాతీయ వేదికలపై వి వర్ హియర్

'వి వర్ హియర్' (We Were Here) పేరుతో ఆయన రూపొందించిన ఈ కామెడీ మాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ పేరును మారుమోగిస్తోంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
టీవీలు, ఫ్రిజ్లుగా మారిన ముగ్గురు పెద్దాయనలు!
చిన్న పట్టణానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ అంకుల్స్ ఈ కథలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మనుషుల ఉద్యోగాలు పోతున్నాయని నమ్మే ఈ పెద్దాయనలు, ఏఐకి ఎదురుతిరగడానికి ఒక వినూత్న నిరసనను ఎంచుకుంటారు. ఇంట్లోని గృహోపకరణాలు (హోమ్ అప్లయన్సెస్) లాగా అంటే టీవీ, ఫ్రిజ్‌లా తాము నటిస్తూ విచిత్రమైన పోరాటం ప్రారంభిస్తారు.
ఏఐ కంపెనీలో ఉద్యోగం రావడంతో
అయితే, ఈ ముగ్గురిలో ఒకరి కొడుక్కు ఏఐ కంపెనీలోనే ఉద్యోగం రావడంతో కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. నవ్వులు పూయించే వినోదంతో పాటు నేటి తరం ఆలోచనలను, పాత తరం భయాలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని ప్రణవ్ భాసిన్ చాలా సహజంగా తెరకెక్కించారు.
80కి పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్.. 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు
ఒక చిన్న హాస్యభరిత ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80కి పైగా ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఏకంగా 20కి పైగా అంతర్జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆస్కార్ రేసులో వి వర్ హియర్
{{/usCountry}}ఒక చిన్న హాస్యభరిత ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80కి పైగా ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఏకంగా 20కి పైగా అంతర్జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆస్కార్ రేసులో వి వర్ హియర్
{{/usCountry}}అమెరికాలోని ప్రసిద్ధ 'ఎస్ఎక్స్ఎస్డబ్ల్యూ' (SXSW) ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ నరేటివ్ షార్ట్' కేటగిరీలో ఆడియెన్స్ అవార్డును గెలుచుకుంది. పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫెస్ట్‌లో 'బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్' సహా రెండు ప్రధాన అవార్డులను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో ఈ చిన్న చిత్రం ఏకంగా ఆస్కార్ (Academy Awards) రేసులో పోటీపడే అర్హతను సాధించడం విశేషం.
అండగా నిలిచిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా
ఈ లఘు చిత్రం సాధిస్తున్న విజయాలను చూసి అంతర్జాతీయ దిగ్గజాలు దీనికి అండగా నిలుస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. ఆమెతో పాటు టోనీ అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త 'వి' (గతంలో ఈవ్ ఎన్స్‌లర్), హాలీవుడ్ నటుడు ఆండ్రూ స్కాట్ ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా చేరారు.
కోట్లాది అంతర్జాతీయ ప్రేక్షకులు చూసేలా
ప్రపంచ ప్రసిద్ధ మ్యాగజైన్ 'ది న్యూయార్కర్' ఈ చిత్రాన్ని తమ 'స్క్రీనింగ్ రూమ్' ప్లాట్‌ఫామ్ కోసం కొనుగోలు చేసింది. దీనివల్ల భారతీయ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ కోట్లాది మంది అంతర్జాతీయ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సరైన ఆలోచన, బలమైన భావోద్వేగం ఉంటే చిన్న కథ కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందని 'వి వర్ హియర్' నిరూపించింది.