...
...
Next Story

తెలుగు అభిమానులకు ప్రియాంక చోప్రా నమస్కారం! గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్‌లో దేసీ గర్ల్ మెరుపులు.. ఫోటోలు వైరల్

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. తెలుగు ఆడియన్స్ కు చేతులెత్తి నమస్కారం పెట్టింది. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Nov 15, 2025, 20:30:32 IST
Advertisement

ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్ ఖరారు అయినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈవెంట్‌కు హాజరయ్యారు. వీళ్లను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.

ప్రియాంక చోప్రా లుక్

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్‌లోకి అడుగుపెడుతూ ఆమె నమస్కారం చేసి, అభిమానులను పలకరించారు. ప్రియాంక తెల్లటి లెహంగా దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. వాటికి సంప్రదాయ ఆభరణాలను జోడించారు. ఆమె లుక్ తెగ వైరల్ అవుతోంది. ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

రాణిలా

మందాకినిగా

మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా మందానికి క్యారెక్టర్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రాజమౌళి సోషల్ మీడియాలో మందాకినిగా ప్రియాంక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

దానిని షేర్ చేస్తూ ఆయన.. “ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. తిరిగి స్వాగతం, దేసీ గర్ల్! ప్రియాంక చోప్రా. మందాకినిగా మిమ్మల్ని చూడటానికి వేచి ఉండలేను’’ అని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks