టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ముఖ్య అతిథిగా అల్లు అరవింద్

డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. దీంతో చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్‌కు మంచి హిట్ దక్కినట్లు అయింది. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 29) నాడు శంబాల విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
అల్లు అరవింద్ కామెంట్స్
అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "‘శంబాల’ సినిమాని యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం ఉంది. ‘శంబాల’ ట్రైలర్ చూసిన వెంటనే ఆదికి బన్నీ (అల్లు అర్జున్) మెసేజ్ పెట్టాడు. కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది (నవ్వుతూ)" అని అన్నారు.
హైవే ఎక్కినట్లుగా దూసుకుపోవాలి
"నా కుటుంబంలోని వ్యక్తి సక్సెస్ అయినప్పుడు నేను రావాలని ఇక్కడకు వచ్చాను. కొంచెం ఆలస్యంగా అయినా కూడా ఆది సాయి కుమార్ అద్భుతంగా నటించి విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి ఆది హైవే ఎక్కినట్టుగా దూసుకుపోవాలి. బ్రహ్మాండమైన పాత్రలు ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను" అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు.
అద్భుతంగా డివైన్ పాత్రను
"అర్చనా అయ్యర్ డివైన్ పాత్రను అద్భుతంగా పోషించారు. బేబీ చైత్ర అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించింది. ఇలాంటి కథను, దర్శకుడిని నమ్మి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఆది సక్సెస్ అయితే.. ఎదిగితే.. సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. ‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను" అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
ఆయన మంచితనం వల్లే
{{/usCountry}}"అర్చనా అయ్యర్ డివైన్ పాత్రను అద్భుతంగా పోషించారు. బేబీ చైత్ర అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించింది. ఇలాంటి కథను, దర్శకుడిని నమ్మి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఆది సక్సెస్ అయితే.. ఎదిగితే.. సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. ‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను" అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
ఆయన మంచితనం వల్లే
{{/usCountry}}ఇదే ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. "సాయి కుమార్ గారి మంచితనం వల్లే ఇండస్ట్రీ అంతా ఇలా కదిలి వస్తోంది. కొడుకు సక్సెస్ అయితే తండ్రి ఎలా సంతోషిస్తారో నాకు తెలుసు. సక్సెస్ కొట్టిన తరువాత కూడా సాయి కుమార్ గారు రిలాక్స్ అవ్వడం లేదు" అని అన్నారు.
గట్టిగా సక్సెస్ కొట్టాడు
"ఆదికి సక్సెస్ రావడం కాస్త లేట్ అయిందేమో కానీ.. చాలా గట్టిగా సక్సెస్ కొట్టాడు. ఆది మంచితనం వల్లే ఈ విజయం దక్కింది. ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారు. సినిమాని అద్భుతంగా తీసిన దర్శక, నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల కూడా ఓ హీరోనే. ఆయన ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడండి" అని దర్శకుడు బాబీ కోరారు.