...
...
Next Story

Dil Raju: భర్తల్ని భార్యలు చంపే క్రైమ్‌తో అదే నీవు అదే నేను-టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు-ఉలిక్కిపడతారన్న దర్శకుడు కొండల్

Adhey Neevu Adhey Nenu Teaser Released By Dil Raju: తెలుగులో క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమా అదే నీవు అదే నేను. తాజాగా నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా అదే నీను అదే నేను టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొండల్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

Published on: Jul 9, 2026, 14:27:09 IST
Advertisement

Dil Raju Launches Adhey Neevu Adhey Nenu Teaser: "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు.

అదే నీవు అదే నేను టీజర్ రిలీజ్

భర్తల్ని భార్యలు చంపే క్రైమ్‌తో అదే నీవు అదే నేను.. టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు.. ఉలిక్కిపడతారన్న దర్శకుడు కొండల్
భర్తల్ని భార్యలు చంపే క్రైమ్‌తో అదే నీవు అదే నేను.. టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు.. ఉలిక్కిపడతారన్న దర్శకుడు కొండల్

రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ అదే నీవు ఇదే నేను సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదే నీవు అదే నేను సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, తాజాగా అదే నీవు అదే నేను టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అదే నీవు అదే నేను టీజర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ కొండల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో

డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ.. "మా అదే నీవు అదే నేను సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించాం. కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటి యూత్ ఆడియెన్స్‌కు మా మూవీ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని అన్నారు.

"ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం" అని కొండల్ తెలిపారు.

ఉలిక్కిపడటం ఖాయం

"డీవోపీ జైపాల్ రెడ్డి అందించిన విజువల్స్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కనిష్క మ్యూజిక్ మా మూవీలో టెక్నికల్‌గా హైలైట్‌గా నిలుస్తాయి. దిల్ రాజు గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ రిలీజ్ చేశాం. ఆయనకు మా మూవీ టీజర్ చాలా బాగా నచ్చింది. తన బ్యానర్ ‌లో చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని దిల్ రాజు గారు చెప్పడం హ్యాపీగా అనిపించింది" అని కొండల్ పేర్కొన్నారు.

సర్‌ప్రైజింగ్ కంటెంట్ ఉంటుంది

"టీజర్ చూశాక ఆడియెన్స్‌లో మా మూవీని థియేటర్‌లో చూడాలని క్యూరియాసిటీ ఏర్పడుతుందని నమ్ముతున్నాం. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. గోవాలో సాంగ్స్ బ్యూటిపుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం" అని డైరెక్టర్ కొండల్ అన్నారు.

"మా ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల గారు మేకింగ్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఒక పెద్ద సినిమాలాగే నిర్మించారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ కోసం ఒరిజినల్ సెట్ వేయించారు. టీజర్ చూసి మూవీ ఇలా ఉంటుందేమో అనుకోవద్దు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, సర్‌ప్రైజింగ్ కంటెంట్ ఉంటుంది" అని దర్శకుడు కొండల్ వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe