Dil Raju Released Missing Meghana Second Lyrical Song: తెలుగులో వస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, మిస్సింగ్ మేఘన మూవీకి వాచస్పతి దర్శకత్వం వహించారు.
మిస్సింగ్ మేఘన నటీనటులు

మిస్సింగ్ మేఘన సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించారు.
ఇటీవల మిస్సింగ్ మేఘన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. అనంతరం మిస్సింగ్ మేఘన సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ "పిల్ల పిల్ల పిల్ల" అనే పాటను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
మిస్సింగ్ మేఘన నుంచి రెండో పాట రిలీజ్
ఈ క్రమంలోనే తతాజాగా మిస్సింగ్ మేఘన సినిమాలోని రెండో పాట విన్నావా ప్రేమ అనే పాటను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా వినవా ప్రేమ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ బాగున్నాయని, సినిమా కూడా హిట్ అవుతుందని దిల్ రాజు ప్రశంసించారు.
మిస్సింగ్ మేఘన రెండో పాట విడుదల సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. "ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాలు ఇచ్చి..పెద్ద ..పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో రెండో లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది" అని అన్నారు.
ఎమోషన్స్ మిస్ కాకుండా
{{/usCountry}}మిస్సింగ్ మేఘన రెండో పాట విడుదల సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. "ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాలు ఇచ్చి..పెద్ద ..పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో రెండో లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది" అని అన్నారు.
ఎమోషన్స్ మిస్ కాకుండా
{{/usCountry}}"మేము రిలీజ్ చేసిన సాంగ్‌కు , టీజర్‌కు ఆడియన్స్ నుంచి, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. సినిమా విషయానికి వస్తే మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా చేయడం జరిగింది. మా సాంగ్స్, టీజర్ ఎంత బాగున్నాయో.. సినిమా అంత కంటే బాగుంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు డైరెక్టర్ వాచస్పతి.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. "నేను సంగీతం అందించిన మిస్సింగ్ మేఘనలోని సాంగ్‌ను దిల్ రాజు లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజు గారికి మ్యూజిక్‌లో మంచి టేస్ట్ ఉంది. అందుకే ఆయన సినిమాలోని పాటలు చాట్ బస్టర్స్ అవుతున్నాయి" అని తెలిపారు.
మంచి బూస్ట్‌నిచ్చింది
"అటువంటి రాజు గారు మా పాట విని చాలా బాగుంది అనడం.. మాకు మంచి బూస్ట్‌నిచ్చింది. నేనే స్వరపరచి, సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు గారు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్" అని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్ఆర్ ధృవన్.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. "ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఆయన హార్ట్ ఫుల్‌గా పాట బాగుంది. సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు. ఆయన అన్నట్టే సినిమా కూడా బాగా వచ్చింది. అలాగే ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను" అని ఆశించారు.