Mythri Ravi Comments On Mandaadi: తెలుగు యంగ్ హీరో సుహాస్ విలన్‌గా నటించిన లేటెస్ట్ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా మండాడి. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాలో హీరోగా కమెడియన్ కమ్ హీరో సూరి చేశాడు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.
ఏపీ, తెలంగాణలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ మండాడి సినిమాలో సుహాస్, సూరితోపాటు మహిమ నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు.
థియేటర్లలో విడుదలైన మండాడి మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మండాడి యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను శనివారం అంటే ఇవాళ (సెప్టెంబర్ 12) గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూరి, సుహాస్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రెండ్రోజుల ముందే చెప్పారు
సూరి మాట్లాడుతూ .. "‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. మైత్రి నవీన్ గారు, రవి గారు ఓ రెండ్రోజుల ముందే ఈ మూవీని చూసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందే చెప్పారు. అన్ని భాషల్లో ఈ సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది. మదిమారన్ గారికి, ఎల్రెడ్ గారికి థాంక్స్" అని అన్నాడు.
"ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా తమ్ముడు సుహాస్ గారికి థాంక్స్. ‘మండాడి’కి తమిళంతో పాటుగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన మైత్రి నవీన్ సార్‌కి, రవి సార్‌కి, శశి సార్‌కి థాంక్స్. మా మీద ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్" అని సూరి తెలిపాడు.
మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం
సుహాస్ మాట్లాడుతూ .. "‘మండాడి’ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. నవీన్ గారితో కలిసి ఈ మూవీని చూశాను. సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని నవీన్ గారు చెప్పారు. మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది" అని పేర్కొన్నాడు.
{{/usCountry}}సుహాస్ మాట్లాడుతూ .. "‘మండాడి’ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. నవీన్ గారితో కలిసి ఈ మూవీని చూశాను. సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని నవీన్ గారు చెప్పారు. మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది" అని పేర్కొన్నాడు.
{{/usCountry}}"సూరి అన్న ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. మహిమ గారి గురించి, రవింద్ర గురించి అందరూ చెబుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదిమారన్ గారికి థాంక్స్. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్" అని విలన్‌గా చేసిన హీరో సుహాస్ చెప్పుకొచ్చాడు.
8 నెలల క్రితమే
మైత్రీ రవి మాట్లాడుతూ .. "‘మండాడి’ సినిమాని ఎనిమిది నెలల క్రితం ఓ బిజినెస్ కట్ చూశాం. వెంటనే శశిని పంపించి బిజినెస్ క్లోజ్ చేశాం. అప్పటికి మూవీ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు మా నమ్మకం నిజమైంది. ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఏడాదిలో మాకు ఇదొక బిగ్గెస్ట్ హిట్" అని అన్నారు.
"సుహాస్, సూరి సీన్లు, బోట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఈ సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు నిర్మాత మైత్రీ రవి యెర్నేని.