టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు.
సూపర్ హిట్ టాక్‌తో శంబాల

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
ఎడమ కాలితో తిప్పి కొట్టింది
రాజేష్ దండా మాట్లాడుతూ .. "శంబాల లాంటి మంచి సినిమాను మీడియానే జనాల వరకు తీసుకెళ్లింది. చిన్న చిత్రాల్ని చూసేందుకు థియేటర్లకు రావడం లేదు అనే మాటల్ని ఎడమ కాలితో తిప్పి కొట్టింది ‘శంబాల’. ప్రివ్యూలో ఈ మూవీని చూసి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌లో ఏదో ఒకటి అవుతుందని చెప్పాను" అని అన్నారు.
డీవియేట్ కాకుండా
"కథను ఎక్కడా డీవియేట్ కాకుండా దర్శకుడు అద్భుతంగా తీశారు. కంటెంట్‌ను నమ్మి ఆది సాయి కుమార్ గారు ఈ మూవీని చేశారు. ఆ కంటెంట్ నచ్చి జనాలు బ్లాక్ బస్టర్ స్టేటస్‌ను ఇచ్చారు. కొడుకు సక్సెస్‌ను చూసి సాయి కుమార్ గారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు" అని రాజేష్ దండా తెలిపారు.
ఇంతకంటే మంచి గిఫ్ట్
"కె ర్యాంప్ చిత్రంతో సాయి కుమార్ గారితో నాకు మంచి బంధం ఏర్పడింది. ఓ కొడుకుగా తండ్రికి ఇంత కంటే మంచి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మంచి డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చి నిలబెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారెప్పుడూ ఇలానే మంచి చిత్రాల్ని తీయాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు.
మరిన్ని రికార్డ్స్ క్రియేట్
{{/usCountry}}"కె ర్యాంప్ చిత్రంతో సాయి కుమార్ గారితో నాకు మంచి బంధం ఏర్పడింది. ఓ కొడుకుగా తండ్రికి ఇంత కంటే మంచి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మంచి డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చి నిలబెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారెప్పుడూ ఇలానే మంచి చిత్రాల్ని తీయాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు.
మరిన్ని రికార్డ్స్ క్రియేట్
{{/usCountry}}ఉషా పిక్చర్స్ సురేష్ మాట్లాడుతూ .. "శంబాల మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఆదికి బ్లాక్ బస్టర్ హిట్ రావడం ఆనందంగా ఉంది. మున్ముందు ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. రెండో వారంలో కలెక్షన్లు పెరుగుతాయి" అని జ్యోస్యం చెప్పారు.
ముఖ్య అతిథిగా అల్లు అరవింద్
కాగా, శంబాల సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని, సాయి కుమార్‌తో మూడు తరాల బంధం అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.