బాలీవుడ్ హాట్ బ్యూటీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ తర్వాత ఆమె సింగిల్‌గానే ఉంటున్నారని అందరూ భావించారు.

అయితే, గత కొద్ది రోజులుగా పంజాబీ గాయకుడు తల్విందర్ సింగ్ సిద్ధూ (Talwiinder)తో దిశా సన్నిహితంగా కనిపిస్తుండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ పుకార్లపై తాజాగా తల్విందర్ స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ సిద్ధూ.
ఆ వార్తలు ఆశ్చర్యపరిచాయి
దిశా పటానీతో డేటింగ్ గురించిన వార్తలపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్విందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"మేము ఒకరికొకరు పెళ్లికి (నుపుర్ సనన్ వివాహం) కొద్ది రోజుల ముందే పరిచయమయ్యాం. అప్పుడే మాపై ఇంత స్థాయిలో అందరి దృష్టి పడుతుందని మేం అస్సలు ఊహించలేదు. ఇలాంటి వార్తలు లేదా ఒత్తిళ్లకు లోను కావాలని మేం అనుకోవడం లేదు. ప్రస్తుతం మా గురించి మేమే తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. పుకార్లు పుట్టించేవారు పుట్టిస్తూనే ఉంటారు, నేను వాటిని అలాగే వదిలేస్తాను" అని తల్విందర్ పేర్కొన్నారు.
మరి మీకు ప్రేమపై నమ్మకం ఉందా? అని అడగగా.. "నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను" అంటూ ఒక చిలిపి సమాధానమిచ్చారు తల్విందర్ సింగ్.
ఎక్కడ మొదలైందంటే?
ఉదయ్‌పూర్‌లో జరిగిన హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ వేడుకల్లో దిశా, తల్విందర్ జోడీగా కనిపించడంతో మొదటిసారి ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన 'లోలపాలూజా ఇండియా 2026' మ్యూజిక్ ఫెస్టివల్లో వీరిద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ రావడంతో, వీరు తమ బంధాన్ని అధికారికం చేసేశారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
దిశా కెరీర్ ముచ్చట్లు..
{{/usCountry}}ఉదయ్‌పూర్‌లో జరిగిన హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ వేడుకల్లో దిశా, తల్విందర్ జోడీగా కనిపించడంతో మొదటిసారి ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన 'లోలపాలూజా ఇండియా 2026' మ్యూజిక్ ఫెస్టివల్లో వీరిద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ రావడంతో, వీరు తమ బంధాన్ని అధికారికం చేసేశారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
దిశా కెరీర్ ముచ్చట్లు..
{{/usCountry}}ఇదిలా ఉంటే, గతంలో ఆరేళ్ల పాటు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్న దిశా పటానీ 2022లో ఆయనతో విడిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే, దిశా పటానీ త్వరలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'ఓ రోమియో' (O Romeo) చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
తల్విందర్ సింగ్ కూడా తనదైన శైలిలో సంగీత ప్రపంచంలో దూసుకుపోతున్నారు. 2022లో 'కమ్మో జీ', 'ధుంధాలా' వంటి హిట్స్‌తో వైరల్ అయిన తల్విందర్ 2024లో 'మిస్‌ఫిట్' అనే తన డెబ్యూ ఆల్బమ్‌ను కూడా విడుదల చేశారు.