Madhavan On Propaganda Tag Political Link: భారతీయ చిత్రసీమలో తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు, సీనియర్ హీరో ఆర్ మాధవన్ తాజాగా తన సినిమాలపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రొపగాండ చిత్రాలుగా ముద్ర

ఆయన ఇటీవల నటించిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' చిత్రాలతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాలను కొంతమంది ప్రోపగాండ చిత్రాలుగా ముద్ర వేయడంపై ఆర్ మాధవన్ స్పందించారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవన్ దేశభక్తిని ప్రదర్శించడాన్ని తప్పుబట్టే ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. సినిమాల్లో "అతిగా భారతీయతను చూపుతున్నారనే" విమర్శలపై మాధవన్ నేరుగా స్పందించారు.
'భారతీయుడిగా గర్వపడటంలో తప్పేముంది?'
"భారతీయుడిగా ఉండటం లేదా భారతీయుడిగా మనల్ని మనం చూపించుకోవడం ఎలా తప్పవుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 'అతిగా భారతీయతను చూపడం' అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఏ రకమైన రాజకీయ ప్రకటన కాదు. ధురంధర్ కథ పాకిస్తాన్ నేపథ్యంలో సాగుతుంది. మనదేశంలో లాగే అక్కడ కూడా మంచి, చెడు రెండూ ఉంటాయి. అలాంటప్పుడు ఇందులో ప్రోపగాండ ఎక్కడుందో విమర్శకులే చెప్పాలి" అని మాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తను నటించే పాత్రలకు నేరుగా న్యాయం చేయడమే నటుడిగా తన బాధ్యత అని మాధవన్ స్పష్టం చేశారు. 'రాకెట్రీ' సినిమాలో నంబి నారాయణన్ జీవితాన్ని యథాతథంగా చూపించానని, ఆయన దేవుడిని నమ్మే వ్యక్తి కాబట్టి గుడికి వెళ్లే దృశ్యాలు పెట్టానని తెలిపారు. అదే మరో బయోపిక్‌లో జీడీ నాయుడు లాంటి నాస్తికుడి పాత్ర చేస్తే, అందులో దేవుడి నమ్మకాలను చూపిస్తే అది తప్పువుతుందని ఉదాహరణగా చెప్పారు.
దేశం కోసం మంచి చెప్పడం నేరం కాదు!
సమాజంలో మన దేశం గురించి ఉండే మంచి విషయాలను, సాధించిన విజయాలను అందరికీ తెలిసేలా చెప్పడం ఎప్పటికీ నేరం కాదని మాధవన్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}సమాజంలో మన దేశం గురించి ఉండే మంచి విషయాలను, సాధించిన విజయాలను అందరికీ తెలిసేలా చెప్పడం ఎప్పటికీ నేరం కాదని మాధవన్ వ్యాఖ్యానించారు.
{{/usCountry}}"చిన్నతనం నుంచే మనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని నేర్పించారు. మన దేశం కోసం మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. మన దేశంలో ఉన్న మంచి విషయాలను పదిమందికీ ఎత్తిచూపడం నా వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేరం అని ఎలా అంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, వారికి మద్దతుగా నిలవడం పౌరుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. నెప్పుడూ ఏ రాజకీయ నాయకుడిని లేదా పార్టీని విమర్శించలేదని మాధవన్ చెప్పారు.
ఏ రాజకీయ పార్టీ నన్ను ఆహ్వానించలేదు!
తనపై పడుతున్న రాజకీయ ముద్రల గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు తమిళనాడులో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తనను ప్రచారం చేయమని లేదా పార్టీలో చేరమని ఆహ్వానించలేదని మాధవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ నాయకుడి సాధించిన మంచి పనులను ప్రశంసించడం తన అలవాటని వివరించారు.
ప్రస్తుతం మాధవన్ నటించిన 'జీడీ నాయుడు' (GD Naidu Movie) థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనితో పాటు ఆర్ మాధవన్ నటించిన 'అదృష్టశాలి', 'సర్కిల్' వంటి ఆసక్తికర ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.