నిర్మాతగా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవల నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ రాకాస. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మించిన సినిమానే రాకాస.
ఓటీటీ సిరీసులుతో

పలు ఓటీటీ సిరీసులతో పేరు తెచ్చుకున్న మానస శర్మ రాకాస చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీతో ఎంటర్టైన్ చేసే సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన ఈ మూవీలో బ్యూటిపుల్ నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. హారర్ కామెడీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన రాకాస చిత్రంలో హీరో హీరోయిన్లతోపాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సూపర్ హిట్ టాక్‌తో
గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసిన రాకాస సినిమా గ్రాండ్‌గా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల అయింది. అప్పటి నుంచి రాకాస సినిమా సూపర్ హిట్ టాక్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణలో శ్రీలక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్ భారీ ఎత్తున రిలీజ్ అయింది.
రాకాస 2 రోజుల కలెక్షన్స్
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘రాకాస’ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టటం విశేషం. శుక్ర, శనివారాల్లో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఆదివారానికి డబుల్ అయింది.
24 గంటల్లో60 వేలకు పైగా టికెట్స్
24 గంటల్లోనే 60 వేలకు పైగా టికెట్స్ సేల్ కావటం రాకాస సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్కు నిదర్శనమని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. జీస్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్టకర్ మానస శర్మ టేకింగ్ సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ పని తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల మన్ననలు
{{/usCountry}}24 గంటల్లోనే 60 వేలకు పైగా టికెట్స్ సేల్ కావటం రాకాస సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్కు నిదర్శనమని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. జీస్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్టకర్ మానస శర్మ టేకింగ్ సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ పని తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
ప్రేక్షకుల మన్ననలు
{{/usCountry}}నిర్మాతగా నిహారిక తన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, నయన్ సారిక గ్లామర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ తదితరులు ఎంటర్‌టైన్ చేసిన విధానం ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.