...
...
Next Story

Raakaasa OTT: బలి కోరే బ్రహ్మ రాక్షసుడు.. చంపేందుకు వెళ్లే వీరుడు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ రాకాస..డేట్ ఇదే

Raakaasa OTT: థియేటర్లలో అదరగొట్టిన బ్లాక్ బస్టర్ మూవీ రాకాస ఓటీటీలోకి రాబోతుంది. చిన్న సినిమాగా వచ్చి హిట్ అందుకున్న ఈ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసింది.

Published on: Apr 26, 2026, 10:39:43 IST
Advertisement

Raakaasa OTT: రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ‘రాకాస’ ఓటీటీలోకి రాబోతుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

రాకాస ఓటీటీ

రాకాస ఓటీటీ రిలీజ్ డేట్
రాకాస ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగు సూపర్ హిట్ మూవీ ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ కు వేళైంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ డిజిటల్ డెబ్యూ చేయబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రాకాస స్ట్రీమింగ్ కానుంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో రాకాస సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాకాస ఓటీటీ రిలీజ్ కానుంది.

బ్లాక్ బస్టర్

రాకాస మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ జై కొట్టారు. ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ రూ.15 కోట్లు అని టాక్. ఈ లెక్కన చూసుకుంటే రాకాస బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.

మెగా డాటర్

రాకాస మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో ప్రొడ్యూసర్ గా ఫస్ట్ విక్టరీ అందుకున్న ఆమె.. ఇప్పుడు రాకాసతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తమ కామెడీతో అదరగొట్టారు. రాకాసకు మానస శర్మ డైరెక్టర్.

రాకాస స్టోరీ

కట్ చేస్తే వీరబాబు అలియాస్ వీరుడు అమెరికా నుంచి ఊరికి వస్తాడు. అదే రోజు తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి. ఆ పెళ్లి ఆపాలని ప్రయత్నించినా వీరుడికి అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది. ఆ బాధలో ఫుల్ తాగి కోట దగ్గరకు వెళ్తాడు. తెల్లారి ఓ వ్యక్తిని చంపాడనే హత్య కేసులో వీరుడు ఇరుక్కుంటాడు.

మరోవైపు ఊరికి హెచ్చరికలు వస్తాయి. కోటలోకి తన ఫ్రెండ్ బదులు వీరుడు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రాక్షసుడిని వీరబాబు చంపాడా? అన్నదే మిగతా కథ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks