సమంతను ఈ ఒక్క సినిమా చేయమని నేనే బలవంతం చేశా- స్త్రీ, ఫ్యామిలీ మ్యాన్ కంటే ఎక్కువ తృప్తినిచ్చింది: భర్త రాజ్ కామెంట్స్

Raj Nidimoru On Samantha Maa Inti Bangaaram Satisfaction: సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న సమంత భర్త రాజ్ నిడిమోరు తన కెరీర్ హిట్స్ అయిన ‘స్త్రీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కంటే ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

Published on: Jun 26, 2026, 13:35:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raj Nidimoru On Samantha Maa Inti Bangaaram Satisfaction: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది.

సమంతను ఈ ఒక్క సినిమా చేయమని నేనే బలవంతం చేశా- స్త్రీ, ఫ్యామిలీ మ్యాన్ కంటే ఎక్కువ తృప్తినిచ్చింది: భర్త రాజ్ కామెంట్స్
సమంతను ఈ ఒక్క సినిమా చేయమని నేనే బలవంతం చేశా- స్త్రీ, ఫ్యామిలీ మ్యాన్ కంటే ఎక్కువ తృప్తినిచ్చింది: భర్త రాజ్ కామెంట్స్

మా ఇంటి బంగారం సక్సెస్ మీట్

ఈ విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో ప్రముఖ బాలీవుడ్ తెలుగు దర్శకుడు, నిర్మాత, సమంత భర్త రాజ్ నిడిమోరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రాజ్ - డీకే ద్వయం హిందీ చిత్రసీమలో, ఓటీటీ ప్రపంచంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఓటీటీ సిరీస్ నుంచి మొన్నటి ‘సిటాడెల్: హనీ బన్నీ’ వరకు ప్రతీది సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే, స్వచ్ఛమైన తెలుగు నేటివిటీతో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ విజయం తమకు మిగిల్చిన తృప్తి వేరని రాజ్ చెప్పుకొచ్చారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ కంటే ఎక్కువ తృప్తి

తన బాలీవుడ్, ఓటీటీ బ్లాక్‌బస్టర్ హిట్స్ కంటే ‘మా ఇంటి బంగారం’ విజయం ఏ రకంగా ప్రత్యేకమైనదనే ప్రశ్నకు రాజ్ ఎంతో హృద్యంగా సమాధానమిచ్చారు.

"మేము హిందీలో ఎన్నో ప్రాజెక్టులు చేశాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్, ‘స్త్రీ’ సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ప్రతి ఒక్కరూ వాటి గురించే మాట్లాడుకున్నారు. కానీ ఆ సినిమాల కంటే ‘మా ఇంటి బంగారం’ చిత్రానికే నాకు అత్యంత అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అందుకే ఈ సినిమా నా గుండెకు బాగా దగ్గరైంది. ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ఆదరణ నన్ను ఎంతగానో కదిలించింది" అని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు.

రిస్క్‌లు.. బడ్జెట్ పరిమితులు

స్వతంత్రంగా సినిమాలు నిర్మించడంలో ఉండే సవాళ్లు, రిస్క్‌లను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గతంలో తాము నిర్మించిన ‘స్త్రీ’ సినిమాకు ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఆ సినిమా భవిష్యత్తుపై అప్పట్లో ఎన్నో అంచనాలు, అనుమానాలు ఉండేవని చెప్పారు. సరిగ్గా అదే రకమైన ఇబ్బందులు ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి కూడా ఎదురయ్యాయని వివరించారు.

"ఈ సినిమా అనౌన్స్ చేయగానే ఇన్వెస్టర్లు ఎవరూ మా వెనుక పరిగెత్తుకుంటూ రాలేదు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ బిజినెస్ ఎలా జరుగుతుందో అనే ఆందోళన మాలో ఉండేది. సినిమాను డిజైన్ చేస్తున్నప్పుడే సమంతలోని పూర్తి నటనను, యాక్షన్ స్కిల్స్‌ను వాడుకుని సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ బడ్జెట్ పరిమితులు, తక్కువ సమయం వంటి సవాళ్లు ఉన్నాయి" అని రాజ్ నిడిమోరు తెలిపారు.

"ఆ సమయంలో సమంత వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై బయట ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. నిజానికి ఆమెకు ఇక సినిమాలు చేయకూడదని అనుకుంది. కానీ నేనే బలవంతం చేసి కనీసం ఈ ఒక్క సినిమా అయినా చేయమని ఒప్పించాను" అని రాజ్ ఆనాటి పరిస్థితులను వివరించారు.

180 కోట్లతో స్త్రీ సినిమా

గతంలో కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రాజ్ నిడిమోరు నిర్మించిన ‘స్త్రీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 182 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి సిరీస్‌లు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ వంతు వచ్చింది.

బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సమంతతోపాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే కీలక పాత్రలు పోషించారు.

అత్తగారింట్లో పద్ధతి గల కోడలిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే స్వర్ణ (ఝాన్సీ) జీవితంలోకి.. ఆమె గతం నుంచి ‘కరుణ’ అనే రహస్య వ్యక్తి ప్రవేశించడంతో కథ ఎలాంటి మలుపులు తిరిగింది, తన గతాన్ని ఎదుర్కొని స్వర్ణ ఎలా నిలబడింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

వారం రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి వారం రోజుల్లోనే భారతదేశంలో దాదాపు రూ. 35 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More