...
...
Next Story

Sleepwalking Hero: స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలిసిపోయింది.. ఇంట్రెస్టింగ్‌గా టార్టాయిస్ ఫస్ట్ లుక్ పోస్టర్

Sleepwalking Hero Raj Tarun Tortoise First Look Released: గత కొన్ని రోజులుగా ఓ హీరో స్లీవ్ వాకింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరదించుంతూ అది ఎవరో చెప్పేశారు. అంతేకాకుండా ఆ హీరో నటించిన లేటెస్ట్ మూవీ టార్టాయిస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Published on: Aug 30, 2026, 21:03:35 IST
Advertisement

Raj Tarun Tortoise First Look Released: నిన్నటి వరకు ఓ హీరో స్లీప్ వాకింగ్ చేస్తున్నాడని, ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే, ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు?, ఆయన సినిమా ఏంటి ? అనేది తాజాగా అనౌన్స్ చేశారు.

స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో రాజ్ తరుణ్

స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలిసిపోయింది.. ఇంట్రెస్టింగ్‌గా టార్టాయిస్ ఫస్ట్ లుక్ పోస్టర్
స్లీప్ వాకింగ్ చేస్తున్న హీరో ఎవరో తెలిసిపోయింది.. ఇంట్రెస్టింగ్‌గా టార్టాయిస్ ఫస్ట్ లుక్ పోస్టర్

స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ అని తాజాగా చెప్పారు. రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్" అంటూ మేకర్స్ ఈ రోజు (ఆగస్టు 30) ప్రకటించారు. టార్టాయిస్ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

కీలక పాత్రల్లో ముగ్గురు

ఈ టార్టాయిస్ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాతలుగా నిర్మిస్తున్నారు.

సస్పెన్స్, డ్రామా ఎలిమెంట్స్

"టార్టాయిస్" సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్‌గా టార్టాయిస్ సినిమాకు వ్యవహరిస్తన్నారు.

ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఫస్ట్ లుక్

"టార్టాయిస్" సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

రాజ్ తరుణ్ కెరీర్‌లోనే చేయని క్యారెక్టర్

టార్టాయిస్ సినిమాలో రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణతోపాటు షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు నటిస్తున్నారు. బెమనొల శ్రీకాంత్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తుండగా.. దేవర మధుకర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

కథ నుంచి దర్శకత్వం వరకు

రాజ్ కృష్ణ, వెంకటేష్ డ్యాన్స్ కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఎడిటర్‌గా గుళ్లపల్లి మాధవ్ కుమార్, సినిమాటోగ్రాఫర్‌గా శబరి విఘ్నేష్ వర్క్ చేస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న టార్టాయిస్ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం బాధ్యతలన్నింటిని రిత్విక్ కుమార్ చేపట్టారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks