Rajamouli: యావత్ భారత చలనచిత్ర రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాటుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి తన అలవాటు మార్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. అనుకున్న డేట్ రోజే మూవీ రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ తో సాగిపోతున్నాడు.
వారణాసి షూటింగ్

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మూవీ షూటింగ్ చివరి దశకు చేరిందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఈ క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఎక్కడా బ్రేకులు లేకుండా చకచకా పనులను పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను చివరి దశకు తీసుకువచ్చినట్లు తెలిసింది.
నాన్-స్టాప్ యాక్షన్
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన సాంగ్ షూటింగ్‌ను రాజమౌళి విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పలు లొకేషన్లలో కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ చిన్న షెడ్యూల్ ముగిసిన వెంటనే, జూన్ మధ్య వారం నుంచి ఒక భారీ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు.
జూన్ మిడ్ వీక్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ జూలై చివరి వరకు నాన్-స్టాప్‌గా సాగనుంది. సినిమాలోనే అత్యంత కీలకమైన, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తాన్ని ఈ లెంథీ షెడ్యూల్‌లోనే తెరకెక్కించనున్నారని టాక్.
ఆగస్టుతో ప్యాకప్
సాధారణంగా రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు సార్లు విడుదల తేదీలు వాయిదా పడటం టాలీవుడ్లో ఒక సెంటిమెంట్‌గా వస్తోంది. బాహుబలి సినిమాలు, ఆర్ఆర్ఆర్ విషయంలో అలాగే జరిగింది. కానీ ‘వారణాసి’ విషయంలో జక్కన్న ఆ అలవాటును మార్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఎక్కడా ఆలస్యం కాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
{{/usCountry}}సాధారణంగా రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు సార్లు విడుదల తేదీలు వాయిదా పడటం టాలీవుడ్లో ఒక సెంటిమెంట్‌గా వస్తోంది. బాహుబలి సినిమాలు, ఆర్ఆర్ఆర్ విషయంలో అలాగే జరిగింది. కానీ ‘వారణాసి’ విషయంలో జక్కన్న ఆ అలవాటును మార్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఎక్కడా ఆలస్యం కాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
{{/usCountry}}"ఆగస్టు చివరి నాటికి సినిమా మొత్తం షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది" అని ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ వెల్లడించారు.
రిలీజ్ డేట్
ఏప్రిల్ 7, 2027న వారణాసిని రిలీజ్ చేస్తామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి తన పూర్తి ఫోకస్‌ను హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పెట్టనున్నాడు.
ఎలాంటి వాయిదాలు లేకుండా, ప్రకటించిన సమయానికే వారణాసి థియేటర్లలోకి వస్తే ఫ్యాన్స్ కు అంతకుమించిన పండుగ ఏముంటుంది? దాని కోసమే రాజమౌళి అండ్ టీమ్ కష్టపడుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ‘వారణాసి’ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది?
జవాబు: చిత్ర యూనిట్ ప్లాన్ ప్రకారం ఆగస్టు చివరి నాటికి వారణాసి సినిమాకు సంబంధించిన టాకీ, యాక్షన్ సీన్లతో కలిపి పూర్తి షూటింగ్ ముగుస్తుంది.
ప్రశ్న: సినిమా తదుపరి మేజర్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం కానుంది?
జవాబు: జూన్ మధ్య వారం నుంచి జూలై చివరి వరకు ఒక సుదీర్ఘమైన షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో సినిమాలోనే అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారు.
ప్రశ్న: ‘వారణాసి’ సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: ఎలాంటి వాయిదాలు లేకుండా, అనుకున్న సమయం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.