...
...
Next Story

బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్.. అమెరికాలోనే ఎక్కువగా అమ్ముడు పోయిన టికెట్స్.. ఎంతంటే?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ బాహుబలి. రెండు పార్టులుగా విడుదలైన ఈ సిరీస్‌ను ఒక్క మూవీ బాహుబలి ది ఎపిక్‌గా విడుదల కానుంది. అక్టోబర్ 31న రిలీజ్ కానున్న బాహుబలి ది ఎపిక్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఇప్పటికే అవి రూ. 3 కోట్ల కలెక్షన్స్ దాటాయి.

Published on: Oct 26, 2025, 12:03:38 IST
Advertisement

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం బాహుబలి. రెండు పార్ట్స్‌గా విడుదలైన ఈ సిరీస్ ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇందులో మొదటి సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా పోలేదు.

రెండు సినిమాలకు ఒక్కటిగా

బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్.. అమెరికాలోనే ఎక్కువగా అమ్ముడు పోయిన టికెట్స్.. ఎంతంటే?
బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్.. అమెరికాలోనే ఎక్కువగా అమ్ముడు పోయిన టికెట్స్.. ఎంతంటే?

2015లో బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కంక్లూజన్‌గా రెండు సినిమాలు చరిత్ర క్రియేట్ చేశాయి. అలాంటి రెండు సినిమాలను కలిపి ఒక్క చిత్రంగా మలిచారు జక్కన్న. ఇది ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ రెండు పార్ట్స్‌ను ఒక్కటిగా బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్‌తో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్.

బాహుబలి ది ఎపిక్ రన్‌టైమ్

రీమాస్టర్ చేసిన విజువల్స్, హై క్వాలిటీ సౌండ్ రెండు పార్ట్స్‌లో తొలగించిన సన్నివేశాలతో బాహుబలి ది ఎపిక్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ రన్ టైమ్ సుమారుగా 3 గంటల 44 నిమిషాలుగా ఉంది. అయితే, అక్టోబర్ 29న యుఎస్, యూకే, ఐర్లాండ్‌లో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది.

బాహుబలి ది ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్

ఆ తర్వాత అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ 'బాహుబలి: ది ఎపిక్' విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాహుబలి ది ఎపిక్ వండర్స్ సృష్టిస్తోంది.

అమెరికాలోనే ఎక్కువ

3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌తో అబ్బురపరిచిన బాహుబలి ది ఎపిక్ కలెక్షన్లతో మరెంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

ఒక్క ప్రశ్నతో అంచనాలు

బాహుబలి మొదటి పార్ట్‌ వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి విదితమే. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్ ఆడియెన్స్‌ను ఆలోచింపజేసింది. దీనిపై పలు విధాలుగా సమాధానాలతో మీమ్స్ కూడా వచ్చాయి. ఈ ఒక్క ప్రశ్నతోనే బాహుబలి 2పై విపరీతమైన క్యూరియాసిటీ, అంచనాలు పెరిగాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe