...
...
Next Story

OTT Trending: తలైవానా మజాకా-ప్రైమ్ వీడియోను ఏలుతున్న రజినీకాంత్- ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా జైల‌ర్ 2-టాప్ 10లో మరో రెండు!

OTT Trending: బిగ్ స్క్రీన్లనే కాదు ఓటీటీలను సూపర్ స్టార్ రజినీకాంత్ షేక్ చేస్తున్నారు. జైలర్ 2తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన తలైవా.. ఇప్పుడుప్రైమ్ వీడియోలోనూ అదరగొడుతున్నారు. రీసెంట్ గా ఈ ఓటీటీలోకి వచ్చిన జైలర్ 2 మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా నిలిచింది. టాప్ 10లో రజినీ మరో రెండు చిత్రాలున్నాయి.

Published on: Nov 17, 2026, 13:12:16 IST
Advertisement

OTT Trending: థియేటర్ అయినా, ఓటీటీ అయినా లేదా టీవీ అయినా.. తనకు తిరుగులేదని, తన స్వాగ్ కు ఎదురు లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ చాటుతూనే ఉన్నారు. ఇటీవల జైలర్ 2తో తన స్టామినాను చాటారు తలైవా. ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రజినీకాంత్ మూడు సినిమాలు టాప్ 10లో ఉండటం విశేషం.

జైలర్ 2 ఓటీటీ

తలైవానా మజాకా-ప్రైమ్ వీడియోను ఏలుతున్న రజినీకాంత్- ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా జైల‌ర్ 2-టాప్ 10లో మరో రెండు! (x/sunpictures)
తలైవానా మజాకా-ప్రైమ్ వీడియోను ఏలుతున్న రజినీకాంత్- ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా జైల‌ర్ 2-టాప్ 10లో మరో రెండు! (x/sunpictures)

రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్ 2’. టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ స్టైల్, స్వాగ్, యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఈ మూవీ థియేటర్లో ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మ లేపింది. రీసెంట్ గా జైలర్ 2 మూవీ నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడా ఓటీటీలో ఈ చిత్రం నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

జైలర్ కూడా ట్రెండింగ్

జైలర్ 2 ఓటీటీలో అదరగొడుతున్న నేపథ్యంలోనే దీని ఫస్ట్ పార్ట్ అయిన జైలర్ మూవీ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. జైలర్ సినిమానూ ఓటీటీ ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. దీంతో జైలర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ట్రెండింగ్ లో ఏకంగా అయిదో ప్లేస్ కు దూసుకొచ్చింది.

జైలర్ సినిమా 2023 ఆగస్టు 10న థియేటర్లలో రిలీజైంది. అప్పుడీ చిత్రం కొత్త రికార్డులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 7, 2023న ఓటీటీలోకి అడుగుపెట్టింది. అంటే ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరోసారి టాప్ 5 ఓటీటీ ట్రెండింగ్ లోకి రావడం విశేషమనే చెప్పాలి.

కూలీ సినిమా

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా సాగుతోందని చెప్పొచ్చు. జైలర్ 2, జైలర్, కూలీ సినిమాలు టాప్ 10లో ట్రెండ్ కావడం తలైవా క్రేజ్ కు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే రజినీ మూవీ ‘ధర్మన్’పైనా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks